మూడుముళ్ల బంధం మూడురోజులకే ముగిసిపోయింది. కాళ్ల పారాణి సైతం ఆరకముందే  నవవధువు ఆత్మహత్య చేసుకుంది. నవ వధువు బలవన్మరణం పాల్పడిన సంఘటన మైసూరు నగరంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.కర్ణాటకలోని మైసూరు కు చెందిన భావన (24) అనే యువతికి నెల రోజుల క్రితం అజయ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో వివాహాం జరిగింది.

Video Advertisement

పెళ్లైన  కొన్ని రోజులకే  భావన అజయ్ ఫోన్ లో తన భర్త వేరే మహిళతో నగ్నంగా ఉన్న ఫోటోలు చూసి షాక్ కు గురైంది.  దీంతో భార్య భావన అజయ్‌ను నిలదీసింది.ఇద్దరి మద్య గొడవ జరిగింది .ఈ విషయం చివరికి రెండు కుటుంబాల పెద్దల వరకు వెళ్లింది. అందరూ కలిసి  ఇద్దరికి రాజీ కూడా చేశారు. తర్వాత భర్త అజయ్ లో ఏటువంటి మార్పురాకపోవడంతో దీంతో తీవ్ర మానసికి వేదనకు గురైన భావన శుక్రవారం తన ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు