Ads
కన్నడ చిత్రపరిశ్రమ నుండి విడుదలైన మరో చిత్రరాజం “కాంతార”. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ సంస్థ అనువాద రూపం లో విడుదల చేసింది. అయితే ఈ సినిమా అందరికీ నచ్చుతోంది. రాసుకున్న కథనం, అల్లుకున్న ఆచార సంప్రాదాయాలు అన్నీ అద్భుతంగా సెట్ అయ్యాయి.
Video Advertisement
అటవీ ప్రాంతం, అందులో రాజ కుటుంబీకులు భూములు, కోలం ఆడే సంప్రదాయం, కాపాడే క్షేత్ర పాలకుడు అంటూ ఇలా కథలో ఎన్నో ఆసక్తిరమైన అంశాలను జోడించాడు దర్శకుడైన రిషభ్ శెట్టి.
రాసింది తానే తీసింది తానే.. నటించింది తానే కాబట్టి రిషభ్ శెట్టికి అన్నీ కలిసి వచ్చాయి. తన పరిధిని మించి రాసుకున్న కథకు.. అద్భుతంగా న్యాయం చేశాడు. కథ, కథనం ఇలా ఎంతో పకడ్బందీగా పేర్చుకున్నట్టు అనిపిస్తుంది. సినిమాలో ఎంతో మంది నటీనటులు కనిపిస్తారు.
అయితే ఎంత మంది కనిపించినా అందరి చూపు మాత్రం రిషభ్ శెట్టి మీద పడుతుంది. రిషభ్ శెట్టి నటన ఏ స్థాయిలో ఉంటుందనేది క్లైమాక్స్ వరకు ఎవ్వరూ ఊహించ లేరు. రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు చేస్తోంది ఈ సినిమా అది కూడా 15 రోజుల్లోనే. అయితే ఈ సినిమా నవంబర్ 4వ తేదీన కన్నడ వెర్షన్ ఓటీటీ లో విడుదల కానుంది.
”అమెజాన్ ప్రైమ్” వీడియో లో ఇది స్ట్రీమింగ్ కానుంది. అద్భుతమైన సౌండ్ డిజైనింగ్, అజనీష్ లోక్నాధ్ సంగీతం, రిషబ్ నటన-దర్శకత్వం, భూత కోలా ఎపిసోడ్స్, చివరి 20 నిమిషాల కోసం “కాంతార” చిత్రాన్ని థియేటర్లో రెండు సార్లు చూసినా తనివి తీరదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే.. ప్రతి ఒక్క సినిమా అభిమాని కచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా కాంతార.
End of Article