“కన్యాదానం” సినిమా సీన్ రిపీట్.. పెళ్ళైన ఏడేళ్లకి ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త… ఎక్కడంటే..?

“కన్యాదానం” సినిమా సీన్ రిపీట్.. పెళ్ళైన ఏడేళ్లకి ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త… ఎక్కడంటే..?

by Anudeep

Ads

శ్రీకాంత్ హీరో గా వచ్చిన కన్యాదానం సినిమా గుర్తుందా..? ఈ సినిమా లో ఉపేంద్ర, రచన ప్రేమికులు గా నటించారు. సినిమా లో రచన ఉపేంద్రను ప్రేమించినప్పటికీ.. శ్రీకాంత్ ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అయితే.. శ్రీకాంత్ తో పెళ్లి అయిన తరువాత కూడా రచన తన ప్రియుడిని మర్చిపోలేకపోతుంది. దీనితో.. శ్రీకాంత్ తన భార్యను ప్రేమించిన వాడికే ఇచ్చి పెళ్లి చేసేస్తాడు.

Video Advertisement

1 kanyadanam

ఇలాంటి సినిమానే బాలీవుడ్ లో మరొకటి ఉంది. “హమ్ దిల్ దే చుకే సనమ్” పేరు తో ఓ సినిమా విడుదలైంది. ఐశ్వర్య రాయ్, అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా లో అజయ్ దేవగన్ భార్య గా ఐశ్వర్యా రాయ్ నటించగా.. సల్మాన్ ఖాన్ ఆమె ప్రియుడి గా నటించారు. ఈ సినిమా లో కూడా అజయ్ దేవగన్ తన భార్య ను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇవన్నీ రీల్ లైఫ్ స్టోరీస్. రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి స్టోరీ నే ఒకటి జరిగింది.

kanyadanam 4

సుల్తాన్‌గంజ్‌ ప్రాంతానికి చెందిన ఉత్తమ్ మండల్ అనే వ్యక్తి ఖగరియా జిల్లాకు చెందిన స్వప్న ను పెళ్లి చేసుకున్నారు. అయితే.. స్వప్న పెళ్ళికి ముందే రాజ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఈ విషయాన్నీ పెళ్లి అయినా తరువాత తెలుసుకున్న ఉత్తమ్ మండల్ బాధపడ్డాడు. కాలక్రమం లో వీరికి ఇద్దరు సంతానం కలిగారు. అయితే.. పెళ్లి అయ్యి ఏడేళ్లయినా.. స్వప్న రాజ్ కుమార్ ను మర్చిపోలేకపోతోంది.

kanyadanam 3

రాజ్ కుమార్ విషయమై వీరిద్దరి మధ్యా గొడవలు కూడా జరిగాయి. పెద్దలు వీరిద్దరి మధ్య సఖ్యత కుదర్చడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీనితో..ఆమెను రాజ్ కుమార్ కె ఇచ్చి పెళ్లి చేయాలనీ ఉత్తమ్ నిర్ణయించుకున్నాడు. దుర్గాదేవి ఆలయం లో పెద్దలందరి సమక్షం లోనే వీరిద్దరికి పెళ్లి చేసారు. వారి పెళ్లిని చూడడానికి ఆ గ్రామస్తులు కూడా వచ్చారు.

kanyadanam 5

గతం లో కూడా బీహార్ లో భగల్పూర్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఓ కేసు కు సంబంధించి జైలు లో ఉన్న సమయం లో అతని భార్య ఇంటి యజమాని కొడుకు ను ప్రేమించింది. దీనితో ఆ భర్త ఆమెను అతనికే ఇచ్చి పెళ్లి చేసి, రెండేళ్ల బిడ్డను కూడా వారికే అప్పచెప్పేసాడు. ప్రస్తుతం జరిగిన ఘటనలో స్వప్న, ఉత్తమ్ ల పిల్లలు ఎవరివద్ద ఉన్నారన్న విషయం తెలియరాలేదు.


End of Article

You may also like