కరాచీ ప్లేన్ క్రాష్ అయ్యేముందు పైలట్ చివరగా మాట్లాడిన మాటలివే..! (ఫుల్ వీడియో)

కరాచీ ప్లేన్ క్రాష్ అయ్యేముందు పైలట్ చివరగా మాట్లాడిన మాటలివే..! (ఫుల్ వీడియో)

by Anudeep

పాకిస్థాన్‌లో  జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 97 మంది ప్రయాణికులు,8మంది సిబ్బంది మరణించారు..  శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు లాహోర్ నుంచి కరాచీకి బయలుదేరిన విమానం సాంకేతిక సమస్యతో కూలిపోయింది.మరో పది నిమిషాలైతే విమానం ల్యాండ్ అయి అందరూ సురక్షితంగా బయటపడేవారే, కానీ ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది..ప్రమాదానికి ముందు ఫైలట్ మాట్లాడిన చివరి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Video Advertisement

లాహోర్ నుండి కరాచీకి బయల్దేరిన విమానంలో అందరూ పవిత్ర రంజాన్ సంధర్బంగా ఇళ్లకు చేరుకుంటున్నవారే. మరికొద్ది సమయంలో గమ్యానికి చేరుకుంటామనగా విమానంలో సాంకేతిక సమస్య రావడంతో పైలట్ అదే విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూంకి ఇన్ఫామ్ చేసాడు. ఏటిసి సిబ్బంది పైలట్ ని అప్రమత్తం చేశారు..ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి రెండు రన్ వేలు సిద్దంగా ఉన్నాయని ఇన్ఫామ్ చేశారు.

కానీ అప్పటికే విమానం పూర్తిగా పైలట్ కంట్రోల్ తప్పింది. అయినప్పటికి ఇం విమానాన్ని ల్యాండ్ చేయడానికి పైలట్ రెండు మూడు సార్లు ప్రయత్నించిన ఫలితం లేకపోయిది.కరాచీకి దగ్గరలోని మోడల్ కాలనీలో సెల్ టవర్ ని ఢీకొట్టి విమానం కుప్పకూలిపోయింది.ఈ ఘటనకి సంబంధించిన సిసిటివి పుటేజ్ ఒకటి మోడల్ కాలనీ ఇంట్లో రికార్డయింది..అందులో విమానం ల్యాండ్ అవుతుందా అన్నట్టుగా ఉండి,సెకెన్ కాల వ్యవధిలో ప్రమాధం సంభవించి మంటలు వచ్చాయి.

ప్రమాదసమయాల్లో చెప్పే కోడ్ వర్డ్  మే డే.. మే డే.. మే డే.. అని మూడు సార్లు చెప్పాడు. ఎటిసి సిబ్బంది అప్రమత్తం చేసినా, ఫైలట్ ఎంత ప్రయత్నించినా విమానం కంట్రోల్ తప్పడంతో చివరికి “WE HAVE  LOST  ENGINE” అని చెప్పి చెప్పంగానే విమానం క్రాష్ అయింది..అంతా క్షణాల్లో జరిగిపోయింది.

watch video:


You may also like