ఈ ప్రీ వెడ్ షూట్ చాలా ప్రత్యేకం.. ఎందుకో మీరే చూడండి..!

ఈ ప్రీ వెడ్ షూట్ చాలా ప్రత్యేకం.. ఎందుకో మీరే చూడండి..!

by Anudeep

Ads

పెళ్లి అంటే కనీసం నెల రోజుల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది. వేడుకంతా కలిపి మూడు నాలుగు రోజుల సందడి. అయితే, ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షూట్ ల హంగామా కూడా ఎక్కువ అవుతోంది. రకరకాల థీమ్స్ తో ప్రీ వెడ్డింగ్ షూట్ లు చేసుకుంటూనే ఉన్నారు. అయితే, కొందరు మరీ శృతిమించి దిగుతుండడం తో వారిని నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు కూడా..

Video Advertisement

dharvad 1

అయితే, ప్రతి దానికి ఓ వైపు చెడు ఉంటె..మరో వైపు మంచి ఉంటుందన్నట్లు.. ఈ ప్రీ వెడ్ షూట్ ని కూడా ఎంతో అందం గా మార్చేశారో జంట. వారు ఎంచుకున్న థీమ్ ఎంతో కొత్త గాను.. సమాజానికి మేలు చేకూర్చే విధం గాను ఉంది. వారు కర్ణాటకకు చెందిన వారు. కర్ణాటక సంప్రదాయానికి అద్దం పడుతూ వారు తీసుకున్న ఫోటోషూట్ ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తోంది.

dharvad 3

మామూలుగానే.. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటేనే చాలా ఖర్చు తో కూడుకున్నది. రకరకాల డ్రెస్ షాపింగ్ చేయడం తో పాటు.. ఎక్కడెక్కడికో వెళ్లి ఫొటోస్ దిగుతూ ఉంటారు. వీరు కూడా ఖర్చు చేశారు. కానీ వీరి ఆలోచన మాత్రం చాలా భిన్నం గా ఉంది. కర్ణాటక, ధర్వాడ్ కు చెందిన ఓ జంట నిఖిల్ మగ్గవి, చేతన్ దేశాయ్ లు ఈ వినూతన ఆలోచనకు తెరలేపారు. వారిద్దరూ ఈ నెల 23 వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ క్రమం లో ఇటీవలే ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకున్నారు.

dharvad 4

కర్ణాటక కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత దత్తాత్రేయ రామచంద్ర బెంద్రే గారి పద్యాలనే నేపధ్యం గా తీసుకుని వారు ఈ ఫోటో షూట్ చేసుకున్నారు. అప్పటి పరిస్థితులకు తగ్గట్టే ఈ షూట్ చేయించుకున్నారు. ఆ ఫోటోగ్రాఫర్ కూడా ఆ పరిస్థితులు ప్రతిబింబించేలా తన శాయశక్తులా కృషి చేసాడు. అందుకు అవసరమైన ఛత్రి, టోపీ, చీర దగ్గరనుంచి ముక్కుపుడక దాకా, చొప్పుల దగ్గరనుంచి.. కోటు జేబులో పెన్ను దాకా.. అన్ని ఆ కాలం లో ఉన్నట్లే సింగారించుకున్నారు. జడ వేయించుకుంటూ, ఆడుకుంటూ, రాసుకుంటూ.. ఇలా రకరకాలుగా ఫోటోలు దిగారు.

dharvad 2

చేతన్ దేశాయ్ కుటుంబం గతం లో బెంద్రే ఇంటి పక్కనే నివాసం ఉండేవారు. దానితో బెంద్రే గారి ప్రభావం కూడా చేతన్ పై ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోటో షూట్ కి అవసరమైన పాత వస్తువులను కూడా బెంద్రే గారి వారసులను అడిగి తీసుకున్నారు. ఈ ఆలోచనా రావడం, అందుకు ఆ ఫోటో గ్రాఫర్ కూడా తోడవ్వడం, బెంద్రే గారి కుటుంబ సభ్యులు వీరికి సహకారం అందించడం తో ఇంత చక్కని ఫోటోలు తీయించుకోవడం సాధ్యమైంది. ఏది ఏమైనా.. ఈ వినూత్న ఆలోచన అదుర్స్ కదా.. ప్రీ వెడ్డింగ్ షూట్ ఫొటోస్ అంటే ఎప్పటికి గుర్తుండిపోయేలా ఉండాలి. ఇలాంటి కాన్సెప్ట్స్ తో తీయించుకుంటే.. వాటిని మనమే కాదు.. పదిమంది గుర్తుంచుకుంటారు అనడానికి వీరి జంట ఉదాహరణ.


End of Article

You may also like