కారు మొత్తానికి ఆవుపేడ ను కోటింగ్ వేసి తిరుమలకి వచ్చాడు.. ఎందుకో తెలిస్తే నవ్వుకుంటారు..!

కారు మొత్తానికి ఆవుపేడ ను కోటింగ్ వేసి తిరుమలకి వచ్చాడు.. ఎందుకో తెలిస్తే నవ్వుకుంటారు..!

by Anudeep

Ads

ఎండాకాలం ఎండలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలుస్తూనే ఉంది కదా.. ఏసీ ఉన్నవాళ్లు అయినా ఇంట్లో చల్లగానే ఉంటారు గాని, బయటకు వస్తే భరించలేరు. ఎండ వేడి నుంచి రక్షణ పొందడానికి ఒక్కొక్కరు ఒక్కో రకం గా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే, ఓ వ్యక్తి చేసిన పనికి మాత్రం నెటిజన్లు విపరీతం గా నవ్వుకుంటున్నారు. ఓ వ్యక్తి అతని కారు కు అద్దాలను మినహాయించి మిగిలిన అన్ని చోట్లా ఆవుపేడ, బంకమట్టి తో కలిసిన కోటింగ్ ను వేసేశాడు.

Video Advertisement

cow dung car 1

ఎండవేడి నుంచి రక్షించుకోవడానికి కొందరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇచ్చినా, మరికొందరు మాత్రం నవ్వులపాలు అవుతూ ఉంటారు. ఈ వ్యక్తి పరిస్థితి కూడా అలానే ఉంది. ఇతను కర్ణాటక ప్రాంతానికి చెందినవాడు. మండుతున్న ఎండలకు చెక్ పెట్టడానికి సదరు వ్యక్తి తన కారుని ఆవుపేడతో అలంకరించాడు. దానివల్ల కారు లోపల చల్లగా ఉంటుందని భావించాడు. కారు మొత్తానికి, అద్దాలను వదిలేసి మిగతా చోట మొత్తం ఆవుపేడ, బంకమట్టి కలిసిన మిశ్రమాన్ని పూసి అలానే కర్ణాటక నుంచి తిరుమలకు ప్రయాణం చేసాడు.

cow dung car 2

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఆ వ్యక్తి తన కారును తిరుమల నందరకం పార్కింగ్‌ కంప్లెక్స్‌ వద్ద ఆ కారును పార్క్ చేసాడు. అక్కడ చాలా మంది దీనిని వింత గా చూసారు. మరికొందరైతే, ఆ కార్ ఫోటోలను తీసి సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు. అది చూసిన నెటిజన్లు కొందరు అతను చేసిన పనికి సెటైర్లు వేయగా.. మరికొందరేమో ఆవుపేడ విశిష్టత గురించి లెక్చర్లు ఇచ్చేస్తున్నారు. మొత్తానికి ఈ ఫోటోలు మాత్రం నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి.


End of Article

You may also like