హ్యాట్సాఫ్ సర్.. ఇంటినే కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చేసిన కర్ణాటక హోమ్ మంత్రి..!

హ్యాట్సాఫ్ సర్.. ఇంటినే కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చేసిన కర్ణాటక హోమ్ మంత్రి..!

by Anudeep

Ads

ప్రస్తుతం దేశమంతా పరిస్థితి ఎలా ఉందొ చూస్తూనే ఉన్నాం.. కరోనా కారణం గా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు ఆసుపత్రుల్లో బెడ్స్ దొరక్క చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ పరిస్థితిల్లో కర్ణాటక హోమ్ మినిస్టర్ బసవరాజ్ బొమ్మై హవేరి జిల్లాలోని షిగ్గావ్ పట్టణంలోని తన ఇంటినే కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చేశారు.

Video Advertisement

karnatak minister

షిగ్గావ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బసవరాజ్ బొమ్మాయి నివాసం యొక్క ప్రాంగణం లో ఇప్పుడు 50 మంది రోగులకు సరిపడా బెడ్స్ ఉన్నాయి. రోగుల సంరక్షణ కోసం వైద్యులు, వైద్య సిబ్బందిని కూడా మంత్రి నియమించారు. “50 పడకలతో పాటు.. అందుకు అవసరమైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని కూడా ఏర్పాటు చేసాము. ప్రభుత్వ మరియు ప్రైవేట్ వైద్యులు మరియు నర్సులతో సహా వైద్య నిపుణుల బృందం కోవిడ్ -19 రోగులకు చికిత్స చేస్తుంది” అని కర్ణాటక మంత్రి పేర్కొన్నారు. వాస్తవానికి బసవరాజ్ బొమ్మై తన కుటుంబం తో కలిసి హుబ్బల్లిలో నివసిస్తుంటారు. తన నియోజకవర్గానికి వచ్చిన సమయం లోనే షిగ్గావ్ లోని నివాసానికి వస్తుంటారు. ఈ నివాసాన్ని ప్రస్తుతం కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చేశారు.


End of Article

You may also like