17 ఏళ్లకే ప్రేమించి పెళ్లి చేసుకుంది.. కానీ మూడు నెలలకే..!

17 ఏళ్లకే ప్రేమించి పెళ్లి చేసుకుంది.. కానీ మూడు నెలలకే..!

by Anudeep

Ads

టీనేజ్ లో ఆకర్షణ కారణం గా పుట్టే ప్రేమలు కన్నవారికి కడుపుకోతను మిగులుస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలోని చిక్‌బళ్లాపురంలో చోటు చేసుకుంది. పదిహేడు సంవత్సరాల అమ్మాయి తానూ ప్రేమించిన అబ్బాయినే పెళ్లాడింది. చివరకు చిన్న కారణానికే అలిగి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే, కర్ణాటకలోని చిక్‌బళ్లాపుర్ జిల్లాలో బేవినహళ్లి గ్రామం లో రాజు కుటుంబం నివసిస్తోంది. రాజు కుమార్తె మమతా కు 17 సంవత్సరాలు.

Video Advertisement

karnataka teenage girl

ఆమె స్కూల్ లో పదవతరగతి చదువుతున్న రోజుల్లోనే తోటి విద్యార్థి అయిన మణికంఠ ను ప్రేమించింది. అయితే ఈ విషయం తల్లి తండ్రులకు తెలియడం తో 2020 జనవరి లో మణికంఠ పై కేసు పెట్టారు. దీనితో వారిద్దరూ మరింత మొండికెక్కారు. తామిద్దరం ప్రేమించుకుంటున్నామని.. పెళ్లిచేసుకుంటామని నొక్కిచెప్పారు. మూడు నెలల క్రితమే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

manikanta parents

అయితే.. చదువు పూర్తి చేయని మణికంఠ కు మమతా ను పోషించడం కష్టతరం గా మారింది. ఈ క్రమం లో మమతా పుట్టిన రోజు రావడం తో తనకు కొత్త డ్రెస్ కొనివ్వాలని కోరింది. అయితే, లాక్ డౌన్ కారణం గా షాపులు లేవని కొత్త డ్రెస్ తేలేనని మణికంఠ చెప్పడం తో మమతా చిన్నబుచ్చుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నామన్న మాటే కానీ కనీసం డ్రెస్ కూడా కొనివ్వలేవని అలిగిన మమత ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే మణికంఠ తల్లితండ్రులే ఆమెని చంపి ఆత్మహత్య గా చిత్రీకరిస్తున్నారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


End of Article

You may also like