Ads
హీరో కార్తీకి తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కార్తీ సినిమా విడుదల అవుతోంది అంటే దాదాపు ఒక తెలుగు సినిమాకి ఉన్న క్రేజ్ ఉంటుంది. కార్తీ కూడా తమిళ్, తెలుగు పరిశ్రమలు రెండు తనకి ఒకటే అని చెబుతూ తెలుగులో కూడా తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటారు. హీరోగా కార్తీ హీరోయిన్ గా శంకర్ కూతురు అదితి నటించిన తమిళ చిత్రం ‘విరుమాన్’ . ఈ చిత్రానికి దర్శకత్వం ప్రముఖ దర్శకులు ముత్తయ్య వహించారు. ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి రోజే మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
Video Advertisement
బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం సూపర్ హిట్ చిత్రాల లిస్టులో చేరింది. విక్రమ్ తర్వాత పెద్ద సినిమాలు లేక విలవిలలాడుతున్న తమిళ్ సినిమా థియేటర్లు ‘విరుమాన్’ రిలీజ్ తో తిరిగి కలకలలాడాయి. సరిగ్గా అదే సమయానికి ఆ చిత్రానికి పోటీగా ఇంకా ఏ సినిమా రిలీజ్ లేకపోవడంతో థియేటర్లన్నీ హౌస్ ఫుల్ బోర్డులతో బిజీ అయిపోయారు. ఇకపోతే కార్తీక్ కెరీర్ లో కూడా ఈ చిత్రం తోనే అత్యంత భారీ ఓపెనింగ్స్ నమోదు అవ్వడం విశేషం.
కానీ కథపరంగా తీసుకుంటే ఇందులో ఎటువంటి కొత్తదనం లేదు. ఈ సినిమాలో కాన్సెప్ట్ తల్లి మరణంకి కారణమైన తండ్రిపై పగ తీర్చుకునే కొడుకు క్యారెక్టర్ పై డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఎక్కడో విన్నట్టు ఉన్నారు కదూ.. అవునండి ఇలాంటి కథే ప్రభాస్ ఆ సినిమాలో చేశాడు…అదే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మున్నా సినిమా. ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ అయినప్పటికీ అదే సెంటిమెంట్ ను వాడిన కార్తీ తమిళ్ లో భారీ హిట్ సాధించాడు. మన తెలుగులో మున్నా కంటే ముందే ఇదే సెంటిమెంట్ ఇంకా చాలా సినిమాల్లో వాడడం జరిగింది.
వెంకటేష్ నటించిన ‘సూర్య ఐపిఎస్’, నాగార్జున ”, కళ్యాణ్ రామ్ ‘పటాస్ ‘,ఈ సినిమాలన్నిటికీ కూడా కామన్ సెంటిమెంట్ పాయింట్ ఇదే. స్టోరీ చాలా రెగ్యులర్ కాన్సెప్ట్ మీద తీసినప్పటికీ తమిళ నేటివిటీకి దగ్గరగా సినిమా చిత్రీకరణ ఉండడంతో ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ ఒక్క కాన్సెప్ట్ మీదే, రిలీజ్ కి ముందే నెగిటివ్ టాక్ కి గురైనప్పటికీ ఈ చిత్రం కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది. భారీ వసూళ్లతో బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టిన ఈ చిత్రం వల్ల డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఎంతో లాభం కలిగింది. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్స్ లో ఒకరైన శక్తి వేలన్ నిర్మాత సూర్య, హీరో కార్తీలకు డైమండ్ బ్రాస్లెట్ మరియు దర్శకుడు ముత్తయ్యకు డైమండ్ రింగ్ బహుమతిగా అందించారు.
End of Article