భార్యభర్తలకు కార్తీ చెప్పిన టాప్ సీక్రేట్…2013 లో పాప పుట్టిన తర్వాత 7 ఏళ్ళకి.!

భార్యభర్తలకు కార్తీ చెప్పిన టాప్ సీక్రేట్…2013 లో పాప పుట్టిన తర్వాత 7 ఏళ్ళకి.!

by Anudeep

Ads

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తనదైన స్టైల్ లో నటిస్తూ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఈ హీరో. మనకు తెలిసిందే హీరో కార్తీ అన్న సూర్య కోలీవుడ్ బడా హీరో. అన్న పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన తమ్ముడు ఈ కార్తి.
తర్వాత మాత్రం తన శైలి లో సినిమాలు చేస్తూ అభిమానులను సంపాదించుకున్నారు. కార్తీ సినిమా లైఫ్ ఎలా ఉన్నా పర్సనల్ లైఫ్ మాత్రం ఫుల్ జోష్ లో సాగిపోతుంది. కాగా కార్తీ ఫ్యామిలీ గురించి చూస్తే.. 2011లో రంజని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కార్తి. వీళ్లది అన్యోన్య దాంపత్యం అంటూ కోలీవుడ్లో చెప్పుకొస్తారు.

Video Advertisement

karthi tips about child gap
అన్నయ్య సూర్య హీరోయిన్ జ్యోతికను ప్రేమ వివాహం చేసుకోగా.. కార్తీ మాత్రం తల్లి దండ్రులు చూపించిన అమ్మాయి మెల్లోనే తాళి కట్టాడు. కార్తీ సతీమణికి 2013లో ఓ పాప పుట్టింది అయితే ఆ తర్వాత వీళ్ళు రెండో బేబీని ప్లాన్ చేసుకోలేదు . ఆ తరువాత దాదాపు ఏడేళ్లకి బేబీని ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. దానికి కారణాలు రీసెంట్ ఇంటర్వ్యులో చెప్పుకొచ్చాడు కార్తి.

karthi tips about child gap
” మొదట మేము ఒక బిడ్డ చాలు అనుకున్నాము. కానీ ఆ తర్వాత మాకు రెండో బిడ్డ అవసరం అని రియలైజ్ అయ్యాము” అంటూ తనదైన స్టైల్ లో ఫన్నీగా కామెంట్ చేసాడు. అంతేకాదు..ఒక్క బిడ్డ చాలు అనుకునే వాళ్లకి సజీషన్ కూడా ఇచ్చాడు. ఖచ్చితంగా రెండో బిడ్డ అవసరం ఉంటుంది..ప్లాన్ చేసుకోండి అంటూ చెప్పుకొచ్చాడు.
కార్తీ చెప్పాడని కాకుండా.. ప్రతి ఒక్క బిడ్డకి తోబుట్టువు అవసరం ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. ఇంట్లో ఒకే బిడ్డ ఉన్నట్టయితే కాస్త మొండిగా.. బయటి వాళ్ళతో కలవకుండా ఉండే మనస్తత్వం అలవడుతుంది. అదే ఇంకో తోబుట్టువు ఉంటే వారికి తోడుగా ఉండటం తో పాటు కలుపుగోలు తనం పెరుగుతుంది. అంతేకాకుండా ప్రతి దానికి తల్లిదండ్రులను అడక్కుండా ఒకరికొకరు తోడుగా ఉంటారు అని పరిశోధనలు వెల్లడించారు.

karthi tips about child gap
అంతేకాకుండా రెండో బిడ్డను ప్లాన్ చేసుకొనే వారు తల్లి ఆరోగ్యం, వయసు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటూ.. బిడ్డకు బిడ్డకు మధ్య రెండు నుంచి అయిదేళ్ల వ్యత్యాసం ఉండేలా చూసుకోవాలి అని పరిశోధకులు వెల్లడించారు. మరో వైపు ప్రస్తుతం కార్తీ మణిరత్నం దర్శకత్వంలో” పోనియన్ సెల్వం 1″లో నటిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 30న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.


End of Article

You may also like