Atharva Movie Review: సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ థ్రిల్లర్ “అథర్వ” హిట్ కొట్టేసిందా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Atharva Movie Review: సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ థ్రిల్లర్ “అథర్వ” హిట్ కొట్టేసిందా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Harika

Ads

తెలుగులో క్రై-మ్ థ్రిల్లర్ మూవీస్ కు కొదవ లేదు. పైగా ఇటువంటి సినిమాలకు ఆదరణ కూడా ఎక్కువ. అనుమానాస్పదంగా జరిగే హ-త్యలు.. అర్థం కాని విధంగా ఉన్న క్లూస్ ..అన్నిటినీ సాల్వ్ చేసే అపర మేధావిగా హీరో ఇటువంటివి ఇప్పటికే ఎన్నో మూవీస్ వచ్చాయి. ఇదే కోవెల వచ్చిన కొత్త చిత్రం అథర్వ. ఈరోజు థియేటర్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం..

Video Advertisement

తారాగణం: కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహన్, విజయ్ రామరాజు, గగన్
విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్ .
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: చరణ్ మాధవనేని
సాహిత్యం: కాసర్ల శ్యామ్, కిట్టు విస్సాప్రగడ
నిర్మాత: సుభాష్ నూతలపాటి
దర్శకత్వం: మహేశ్ రెడ్డి
నిర్మాణ సంస్థ: పెర్గో ఎంటర్టైన్మెంట్స్,
విడుదల: 1 డిసెంబర్ 2023

కథ:

దేవ్ అథర్వ కర్ణ (కార్తీక్ రాజు).. చిన్నతనం నుంచి పోలీసు అవ్వాలని కలలు కంటాడు కానీ అతనికి ఉన్న ఆస్తమా కారణంగా సెలక్షన్ లో ఫెయిల్ అవుతా. ఎలాగైనా పోలీస్ అవ్వాలి అన్న తపనతో క్లూస్ టీం గురించి తెలుసుకున్న అథర్వ.. కష్టపడి పరీక్షల్లో పాస్ అయి అందులో జాయిన్ అవుతాడు. జాయిన్ అయితే అవుతాడు కానీ కొన్ని రోజులపాటు అతని వద్దకు ఎటువంటి కేసులు రావు. అయితే ఒక రోజు సడన్గా ఒక క్రై-మ్ సీన్ ని అతను సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇంటెలిజెన్స్ ఉపయోగించి దీన్ని క్షణాల మీద సాల్వ్ చేస్తాడు.

అదే సమయంలో క్రైమ్ రిపోర్టర్ గా వర్క్ చేస్తున్న నిత్య(సిమ్రన్ చౌదరి)ని అథర్వ కలుస్తాడు. నిత్య కాలేజ్ డేస్ లో అతని జూనియర్ ..ఎంతో ఇష్టపడ్డా చెప్పే ధైర్యం లేక అప్పట్లో సైలెంట్ గా ఉంటాడు.ఇన్ని రోజులు తర్వాత కలుసుకున్న వాళ్ల మధ్య మెల్లిగా తిరిగి స్నేహం చిగురిస్తుంది. ఈ క్రమంలో నిత్య హీరోయిన్ అయిన తన ఫ్రెండ్ జోష్ని (ఐరా) ను అథర్వ కు పరిచయం చేస్తుంది. ఈ క్రమంలో ఒకరోజు ఇద్దరూ జోష్ని ఇంటికి వెళ్తారు కానీ అప్పటికే అక్కడ ఆమె..ఆమె ప్రియుడు శివ శవాలై కనిపిస్తారు.

ఒక్క క్లూ కూడా అక్కడ లేకపోవడంతో..హ-త్య విషయంలో మొదటి శివుని అనుమానిస్తారు. కానీ
జోష్ని శివల బంధం గురించి నిత్య చెప్పింది నమ్మి అథర్వ వాళ్ల కేసు సాల్వ్ చేయడానికి పూనుకుంటాడు. ఈ నేపథ్యంలో అతను ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాడు ?ఇంతకీ వాళ్ళిద్దర్నీ హ-త్య చేసింది ఎవరు? ఫైనల్ గా దాన్ని ఎలా సాల్వ్ చేస్తాడు తెలియాలి అంటే సినిమా చూడండి?

విశ్లేషణ:

మూవీ స్టోరీ పాతదైన.. కన్వే చేసిన విధానం చాలా కొత్తగా ఉంది. సినిమాతో పాటు ప్రేక్షకులు కూడా స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోతారు.. ట్విస్టు మీద ట్విస్టులతో కన్ఫ్యూజ్ అవుతున్న టైం లో సడన్ గా ఒక డేట్ ఎండ్ ఎదురవుతుంది. ఇక అక్కడ నుంచి ఎటుపోవాలో అర్థం కాక హీరో తికమక పడుతుంటే.. మనం కూడా ఎక్సైట్ అయిపోతాం. స్టోరీ టేకింగ్ అంత ఆసక్తిగా ముందుకు సాగుతుంది. మూవీ అయితే మాంచి గ్రిప్పింగ్ గా ఉంది. మంచి క్రైమ్ థ్రిల్లర్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు.. అయితే ఇవాళ విడుదలైన యానిమల్ ఒకపక్క.. నెక్స్ట్ వీక్ విడుదల కాబోతున్న హాయ్ నాన్న, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మరోపక్క.. ఈ మూవీకి గట్టి పోటీని ఇస్తాయి. మరి ఎంతవరకు ఈ మూవీ తట్టుకోగలదు చూడాలి.

ప్లస్ పాయింట్స్:

  • స్టోరీ ముందుకు వెళ్లే విధానం ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంది.
  • హీరో ,హీరోయిన్ తో పాటు ప్రతి ఒక్క యాక్టర్ తమ పాత్రను అద్భుతంగా పోషించారు.
  • చూసేవాళ్ళు స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయే విధంగా కథనం ముందుకు సాగుతుంది.
  • స్టోరీ మధ్యలో ట్విస్టులు చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:

  • అక్కడక్కడ కాస్త సాగదీసినట్టుగా ఉంటుంది.
  • కొన్ని సన్నివేశాల్లో లాజిక్ మిస్ అయింది.

రేటింగ్:2.5/5

చివరి మాట:

మంచి క్రై-మ్ థ్రిల్లర్ మూవీస్ నచ్చేవారికి ఈ సినిమా కచ్చితంగా సెట్ అవుతుంది.

ట్రైలర్:


End of Article

You may also like