“అప్పుడొచ్చిన వార్త వల్లే “విరూపాక్ష” సినిమా చేశాము..!”.. డైరెక్టర్ కార్తిక్ వర్మ కామెంట్స్..!

“అప్పుడొచ్చిన వార్త వల్లే “విరూపాక్ష” సినిమా చేశాము..!”.. డైరెక్టర్ కార్తిక్ వర్మ కామెంట్స్..!

by kavitha

Ads

ఈ సంవత్సరం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సినిమాలలో విరూపాక్ష మూవీ ఒకటి. ఈ చిత్రంలో హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ సంయుక్త మీనన్ జంటగా నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ లో రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ ను రాబట్టింది.

Video Advertisement

ఈ చిత్రానికి కార్తిక్ వర్మ దర్శకత్వం వహించారు. తాజాగా కార్తిక్ వర్మ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విరూపాక్ష మూవీని తెరకెక్కించడానికి కారణం పేపర్ లో వచ్చిన ఒక వార్త అని చెప్పారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
virupaksha-1విరూపాక్ష సినిమా అంచనాలు ఏమి లేకుండా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. యాక్సిడెంట్ వల్ల చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న సాయి ధరమ్ తేజ్ కు ఈ చిత్రం మంచి కంబ్యాక్ ఇచ్చింది.  గోల్డెన్ బ్యూటీగా పాపులర్ అయిన సంయుక్తమీనన్ ఈ మూవీతో  మరోసారి ప్రశంసలు అందుకుంది.
ఈ క్రమంలోనే  దర్శకుడు కార్తిక్ వర్మ ఈ సినిమాని తెరకెక్కించడానికి కారణం వివరించారు. తనకు చిన్నప్పటి నుండి హారర్ చిత్రాలు అంటే ఎక్కువ ఆసక్తి ఉండేదని చెప్పారు. 2016-17 సంవత్సరంలో వార్తా పత్రికలో వచ్చిన ఒక  క్రైమ్ న్యూస్ చదివిన తరువాత ఈ మూవీని రూపొందించాలనే ఆలోచన వచ్చిందని అన్నారు. ఉత్తరాదిలో ఒక పల్లెటూరులో ఒక మహిళ ఆమె భర్త మరణించడంతో ఊరి చివరలో నివస్తుండేది. అదే టైంలో ఊర్లోని ఇద్దరు పిల్లలు అనారోగ్యంతో చనిపోయారు. దాంతో గ్రామంలోని వారంతా ఆ మహిళను సందేహించి, క్రూరంగా చంపేశారు.
ఈ న్యూస్ చదివిన అనంతరం విరూపాక్ష కథ రాయాలనిపించింది. తాను రాసిన స్టోరీలో పార్వతి పాత్ర చేసిన శ్యామల విలన్. ఆమె తల్లిదండ్రులు మరణించిన తరువాత ఆ ఊరు నుండి వెళ్ళిపోయి, తిరిగి అదే ఊరుకి కోడలిగా వచ్చి ఆ గ్రామం పై పగ తీర్చుకుంటుంది. అయితే సుకుమార్ సర్, కథను మార్చి హీరోయిన్ సంయుక్త మీనన్ ను విలన్ చేశారు.  దానికి తగ్గట్టు మార్పులు చేయాడం కోసం 7 నెలలు పట్టింది అని చెప్పారు.

Also Read: ఒకప్పటి ఈ 16 మంది “చైల్డ్ ఆర్టిస్ట్స్” ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? ఏం చేస్తున్నారంటే?


End of Article

You may also like