Home Filmy Adda “రంగ రంగ వైభవంగా” సినిమాలో హీరో కంటే… “డాక్టర్ బాబు”కే ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందిగా..?

“రంగ రంగ వైభవంగా” సినిమాలో హీరో కంటే… “డాక్టర్ బాబు”కే ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందిగా..?

by Anudeep

డాక్టర్ బాబు సినిమాలో రావడం ఏమిటి…. కొంపదీసి కార్తీకదీపం సీరియల్ ను సినిమాగా తీసి రిలీజ్ చేస్తున్నారా…… డాక్టర్ బాబు వంటలక్క బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చేసారా….అని కంగారు పడుతున్నారా…..లేదండి. ఈ మధ్య విడుదలైన రంగ రంగ వైభవంగా సినిమాలో కార్తీక్ బాబు నటించాడు.

అందుకే వంటలక్క భర్త అయినా కార్తీక్ బాబు గురించి ఆయన అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో డాక్టర్ బాబు ఓ గెస్ట్ రోల్ లో కనిపించి సందడి చేశారు. అయితే విశేషమేమిటా అనుకుంటున్నారా…. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల ఎంట్రీ కి కూడా రాని రెస్పాన్స్ సినిమా లో డాక్టర్ బాబు ఎంట్రీ కి వచ్చింది.

karthika deepam doctor babu in ranga ranga vaibhavanga movie

డాక్టర్ బాబు థియేటర్స్‌లో కనిపించేసరికి ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు కార్తీక దీపం అభిమానులు. రీసెంట్ గా రిలీజ్ అయిన ‘రంగ రంగ వైభవంగా’ సినిమా థియేటర్స్ వద్ద మాత్రం మన వంటలక్క భర్త కార్తీక్ గురించి ఒకటే చర్చ. దీన్నిబట్టే డాక్టర్ బాబు మేనియా ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. సినిమా వస్తుంది….పోతుంది మళ్ళీ తిరిగి ఏపుడో చూస్తాము….కానీ డాక్టర్ బాబు అలా కాదు కదా…. మన ఇంటికి ప్రతిరోజు వస్తాడు…. రోజు కార్తీక దీపం వెలిగిస్తాడు….. కాబట్టి ఆడియన్స్ కార్తీకదీపం దీపం సీరియల్ కు బాగా కనెక్ట్ అయిపోయారు.

karthika deepam doctor babu in ranga ranga vaibhavanga movie

దాంతో సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా కథ గురించి హీరో హీరోయిన్ల గురించి మాట్లాడకుండా కేవలం డాక్టర్ బాబు గురించే చర్చిస్తున్నారు.”అసలు డాక్టర్ బాబు ఎంట్రీ చూసి అందరం సర్ప్రైజ్ అయ్యాం ” అంటూ తెగ సంబరపడిపోతున్నారు. ఇంతకీ ఈ సినిమాలో డాక్టర్ బాబు రోల్ ఏంటి అని ఆలోచిస్తున్నారా….. ఈ మూవీలో తులసి, ప్రగతి కాంబినేషన్లో ఒక సీన్ లో డాక్టర్ బాబు గుడిలో కనిపిస్తాడు. కార్తీకదీపం సీరియల్‌కి వీరాభిమాని అయిన ప్రగతి గుడిలో డాక్టర్ బాబు చూసి సర్ ప్రైజ్ అవుతుంది.

karthika deepam doctor babu in ranga ranga vaibhavanga movie

మీరు కూడా ఇదే గుడికి వస్తారా? మా వదినకు మీరంటే ఎంత ఇష్టమో తెలుసా? మీ సీరియల్‌లో ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాము.. మా దీపక్క ను కూడా తీసుకొచ్చారా? లేదంటే ఆ టెక్కులాడి మోనితతో వచ్చారా? అంటూ వరుస ప్రశ్నలు వర్షం కురిపిస్తారు . ఆ దెబ్బతో డాక్టర్ బాబు.. అమ్మా ఇది షూటింగ్ కాదు.. నేను పర్సనల్‌గా వచ్చాను అని చెబుతాడు. ఈ సీన్ కి ఊహించని రెస్పాన్స్ రావడంతో డాక్టర్ బాబుకి ఇంతమంది అభిమానులు ఉన్నారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

You may also like