Ads
నిరుపమ్ పరిటాల గురించి కొత్త గా చెప్పాల్సిన అవసరం లేదు. “కార్తీక దీపం” సీరియల్ తో నిరుపమ్ ఇంటింటికి డాక్టర్ బాబు గా పరిచయం అయిపోయాడు. ఇప్పటివరకు నిరుపమ్ అంటే ఒక లెక్క.. కార్తీక దీపం వచ్చిన తరువాత నుంచి నిరుపమ్ అంటే డాక్టర్ బాబు గానే ప్రేక్షకులు గుర్తించేంత గా మారిపోయాడు. కార్తీకదీపం సీరియల్ ఎంత ఫేమస్ అయిందో అందరికి తెలిసిందే.
Video Advertisement
ఈ సీరియల్ తో నిరుపమ్ కూడా తెలుగు వారి లోగిళ్ళలో బాగా పాపులర్ అయిపోయాడు. తన కాస్ట్యూమ్స్ విషయం లో కూడా నిరుపమ్ ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. సీరియల్ లో మాత్రం ఎక్కువ గా షర్ట్ వేసుకుని దానిపై స్వెట్టర్ లాంటి షర్ట్ వేసుకుని కనిపిస్తాడు. కానీ బయట మాత్రం చాలా డిఫరెంట్ లుక్స్ లో దర్శనం ఇస్తూ ఉంటాడు. సీరియల్ లో కొంచం సీరియస్ గానే కనిపించే నిరుపమ్ బయట మాత్రం సరదాగానే ఉంటాడు. సోషల్ మీడియా లో కూడా తన అభిమానులతో సరదాగా గడిపేస్తూ ఉంటాడు.
ఎప్పుడు ఎదో ఒక అప్డేట్ లేదా పోస్ట్ లతో నిత్యం అభిమానులతో టచ్ లోనే ఉంటాడు. తాజాగా.. ఇన్స్టా గ్రామ్ లో ఓ ఫోటో పోస్ట్ చేసాడు. అతుకుల చొక్కా వేసుకుని.. చాలా సీరియస్ లుక్ లో కనిపిస్తున్నాడు. దీని వెనుక సంగతి ఏంటో కూడా తానె పోస్ట్ లో తెలిపాడు. “స్మైల్ వేయచ్చు కదా అంటూ ప్రత్యేకం గా చెప్పకండి..ఈ ఫోటో ని తీసినవాడే వద్దన్నాడు. అదేంటి అంటే.. ఆటిట్యూడ్ అన్నాడు.. ఈ సారికి ఇలా కానివ్వండి.. నా అతుకుల చొక్కా క్రెడిట్స్ @dhruboutikque కె ఇవ్వండి..” అంటూ పోస్ట్ చేసాడు. అదన్నమాట అసలు సంగతి.
View this post on Instagram
End of Article