Ads
కార్తీకదీపం సీరియల్ ఎంతటి క్రేజ్ ను సంపాదించుకుందో మనందరికీ తెలిసిన విషయమే. సాయంత్రం అయితే చాలు ఎపుడు వస్తుందా ఆ సీరియల్ అని ఎదురు చూస్తూ ఉంటారు.అత్యంత టాప్ రేటింగ్ ఉన్న సీరియల్ గా గుర్తింపు తెచ్చుకుని అందరి మన్ననలు పొందుతోంది.అయితే ఈ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ భామ ప్రేమి విశ్వనాధ్ వంటలక్క గా మనఇంట్లో మనిషి గా కలిసిపోయింది.
Video Advertisement
ఒకప్పుడు సోషల్ మీడియా కి దూరం గా ఉన్న ప్రేమి విశ్వనాధ్.. ప్రస్తుతం సోషల్ మీడియా లో కూడా ఆక్టివ్ గా ఉంటూ అటు మలయాళం, ఇటు తెలుగు అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. సీరియల్ లో వంట చేస్తూ స్వయం ఉపాధి కల్పించుకున్న మహిళగా ఆదర్శం గా నిలిచిన ప్రేమి కి రియల్ లైఫ్ లో పెద్దగా వంట చేయడం రాదట. ఆమె సెట్స్ లో ఎలా ఉంటుందో డాక్టర్ బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పంచుకున్నారు. ప్రేమి కి నాన్ వెజ్ లేకపోతే ముద్ద దిగదట.. అలాగే., సెట్స్ లో ప్రేమి చేసే అల్లరి మాములుగా ఉండదట.
End of Article