Ads
తెలుగు సీరియల్ ఇండస్ట్రీలో కార్తీకదీపం కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే అంత క్రేజ్ ఉన్న కార్తీకదీపం సీరియల్ డైరెక్టర్ ఎవరో తెలుసుకోవాలనే ఆత్రుత చాలా మందికి ఉంటుంది.
Video Advertisement
కార్తీకదీపం సీరియల్ డైరెక్టర్ పేరు కాపు గంటి రాజేంద్ర. రాజేంద్ర గారు కార్తీకదీపం సీరియల్ తో పాటు అంతకుముందు కూడా కొన్ని సీరియల్స్ కి దర్శకత్వం వహించారు.
టీవీ9 కథనం ప్రకారం దర్శకరత్న దాసరి నారాయణరావు గారి వద్ద రాజేంద్ర గోరింటాకు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. అదే రాజేంద్ర మొదటి సినిమా. ఆ తర్వాత గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన డబ్బు భలే జబ్బు సినిమాతో దర్శకుడిగా మారారు. తొలిప్రేమ తర్వాత రాజేంద్ర, పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా క్యాన్సిల్ అయ్యింది.
అయితే రాజేంద్ర, మోహన్ బాబు గారు, సౌందర్య గారు హీరో హీరోయిన్లుగా నటించిన శివ శంకర్ సినిమాకి దర్శకత్వం వహించారు. ఒక సందర్భంలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ సౌందర్య గారి మరణం గురించి గుర్తు చేసుకున్నారు రాజేంద్ర. ఆ సినిమా షూటింగ్ సమయంలో సౌందర్య గారు అడిగిన రిక్వెస్ట్ ని మోహన్ బాబు గారు అంగీకరించకపోతే ఉంటే సౌందర్య ఇవాళ మన మధ్య ఉండేవారు అని అన్నారు.
బిజెపి ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం వెళ్ళటానికి సౌందర్య గారు, మోహన్ బాబు గారిని పర్మిషన్ అడిగారు. సాధారణంగా ఎవరైనా సినిమా మధ్యలో వెళ్తాను అంటే మోహన్ బాబు గారు అంగీకరించరు. కానీ సౌందర్య గారు రిక్వెస్ట్ చేయడంతో మోహన్ బాబు గారు సరే అన్నారు.
ఒకవేళ సౌందర్య గారు గనుక ఆ రోజు వెళ్లకపోతే ఉంటే ఇవాళ మన మధ్య ఉండేవారు అని, సౌందర్య గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో శివ శంకర్ సినిమా స్టోరీ మార్చాల్సి వచ్చింది అని, ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది అని దాంతో ఆ సినిమా ఫ్లాప్ ఆయన కెరియర్ పై కూడా ఇంపాక్ట్ చూపిందని తెలిపారు రాజేంద్ర.
End of Article