“కార్తికేయ-2” OTT లో విడుదలయ్యేది అప్పుడేనా..? ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

“కార్తికేయ-2” OTT లో విడుదలయ్యేది అప్పుడేనా..? ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

by Anudeep

Ads

డిఫరెంట్ జానర్ ఎంటర్‌టైనర్‌లకు పేరుగాంచిన నిఖిల్ సిద్ధార్థ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామా కార్తికేయ 2 తో ఈసారి ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2014 సంవత్సరంలో విడుదలైన హిట్ చిత్రం కార్తికేయకు సీక్వెల్ గా రిలీజ్ అయిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు .

Video Advertisement

త్రిల్లింగ్ సీక్వెన్స్ తో, మంచి కథతో ,ఆకట్టుకునే సన్నివేశాలతో ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. నిఖిల్ సిద్ధార్థ యాక్షన్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచింది.

karthikeya 2 movie review

కార్తికేయ మూవీ అంతా ఒక విలేజ్ లోని కార్తికేయ స్వామి టెంపుల్ చుట్టు ఉన్న మిస్టరీ గురించి కాగా దానికి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ 2 లో హీరో శ్రీకృష్ణుడి కు సంబంధించిన కొని రహస్యాలను ఛేదించడానికి వెళ్తాడు.తాజా నివేదిక ప్రకారం ఈ చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్‌కి ZEE5తో మంచి అనుబంధం ఉన్న కారణంగా కార్తికేయ 2′ చిత్రం పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ ఓటీటీ హక్కులను ZEE5 చేజిక్కించుకుంది.ఇప్పుడు థియేటర్లో నడుస్తున్న ఈ సినిమా నాలుగు వారాల తర్వాత ZEE5 లో స్ట్రీమ్ అవ్వబోతున్నట్లు సమాచారం.

karthikeya 2 movie review

ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా నిఖిల్ సిద్ధార్థ హీరో క్యారెక్టర్ ప్లే చేశారు. ఈ చిత్రంలో ధన్వంతరి అనే ఒక ముఖ్య పాత్రలో బాలీవుడ్ అగ్ర నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు.కార్తికేయ 2 ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యాంక్రోల్ చేయగా, కాల భైరవ సంగీతం సమకూర్చారు.హిందీలో డబ్ అయిన ఈ సినిమా నార్త్ బెల్ట్ లో కూడా సందడి చేస్తోంది. రిలీజ్ అయిన రెండు రోజుల లోనే బాక్సాఫీస్ వద్ద రూ.35 లక్షలు వసూలు చేసింది.


End of Article

You may also like