“కార్తికేయ-2” సెన్సార్ రివ్యూ.! సినిమా గురించి ఏం చెప్పారంటే..?

“కార్తికేయ-2” సెన్సార్ రివ్యూ.! సినిమా గురించి ఏం చెప్పారంటే..?

by Anudeep

Ads

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హిట్ , ఫ్లాప్ అని తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. మొదటి నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు నిఖిల్.

Video Advertisement

నిఖిల్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో కార్తికేయ మూవీ ఒకటనే సంగతి తెలిసిందే. నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో కార్తికేయ తర్వాత కిర్రాక్ పార్టీ సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. అయితే ఇదే కాంబినేషన్ లో తెరకెక్కిన కార్తికేయ2 సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఒక్క కట్ కూడా లేకుండా ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ రావడంతో నిఖిల్ అభిమానులు సంతోషిస్తున్నారు. సెన్సార్ సభ్యులు కార్తికేయ2 సినిమాలో అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కార్తికేయ2 కాన్సెప్ట్ ఆలోచనను రేకెత్తించే విధంగా ఉందని సెన్సార్ సభ్యులు వెల్లడించారు.

సెన్సార్ బృందం సినిమా గురించి పాజిటివ్ గా చెప్పడంతో నిఖిల్ అభిమానులు సైతం ఈ సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. నిఖిల్ కు, అనుపమకు ఈ మూవీ సక్సెస్ కీలకమని చెప్పవచ్చు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తేనే డైరెక్టర్ చందూ మొండేటికి కూడా మరిన్ని సినిమాలు వస్తాయి.

అయితే ఈ మూవీకి పోటీగా థియేటర్లలో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా విడుదలవుతోంది. కార్తికేయ2 సినిమా 30 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది. అలాగే సుకుమార్ రైటింగ్స్ పై తెరకెక్కుతున్న 18 పేజెస్ సినిమాలో నిఖిల్ విభిన్నమైన పాత్రలో నటించనున్నాడు. ఈ మూవీలో కూడా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ కాగా దీన్ని బన్నీవాస్ నిర్మిస్తున్నారు.


End of Article

You may also like