Ads
బుల్లి తెరపై “కార్తీక దీపం” సీరియల్ సృష్టించిన సంచలనం మనకు తెల్సిందే. మూస రీతిన సాగుతున్న తెలుగు సీరియల్స్ లో ఈ సీరియల్ కథ, కథనం సరి కొత్తగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో ప్రధాన పాత్రధారులైన డాక్టర్ బాబు కార్తిక్, వంటలక్క దీప, మోనిత, సౌందర్య పాత్రలు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి. సూపర్ స్టార్ల సినిమాలను మించి దీనికి రేటింగ్స్ వచ్చేవి.
Video Advertisement
ఒకే కథతో చాలా కాలం గా నడచిన ఈ సీరియల్ ను ప్రేక్షకులు ఆదరిస్తూ వచ్చారు. కానీ గత కొంత కాలం గా ప్రేక్షకులు కార్తీక దీపాన్ని పక్కన పెట్టేసారు. దానికి కారణం ఈ సీరియల్లో ప్రధాన పాత్రలైనా డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు చనిపోవడమే.
ప్రధాన పాత్రలు తీసేసిన తర్వాత వారి నెక్స్ట్ జెనెరేషన్ అయినా శౌర్య , హిమ లను ప్రధాన పాత్రలుగా పెట్టి సీరియల్ను కొనసాగించారు. కానీ ఈ మార్పును ప్రేక్షకులు అంతగా రిసీవ్ చేసుకోలేకపోయారు. దీంతో ఆ ఎఫెక్ట్ సీరియల్ రేటింగ్ పై ప్రభావం చూపించింది.
ఈ ఎఫెక్ట్ తో కార్తీక దీపం మేకర్స్ అదిరిపడ్డారు. తమ రేటింగ్స్ తిరిగి తెచ్చుకోవడానికి ఏం చేయాలో తెలియక చనిపోయిన డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలకు తిరిగి జీవం పోశారు. చనిపోయిందనుకున్న వంటలక్క దీప ఎక్కడో హాస్పిటల్ లో కోమా లోంచి బయటకు వచ్చింది. డాక్టర్ బాబు ని కూడా తెరపైకి తెచ్చేసారు. ఇక మోనిత మాత్రం ఎందుకు లేట్ చేయడం అని తాను కూడా తెలుగు ప్రేక్షకుల కోసం వచ్చేసింది.
కానీ ఇలా సీరియల్ ను ,దాని కథ ను మార్చేసి తమను పిచ్చోళ్లను చేస్తున్నారని ప్రేక్షకులు కార్తీక దీపాన్ని లైట్ తీసుకున్నారు. పాత కథనే మళ్ళీ చూపిస్తున్నారంటూ ఇక దాన్ని వదిలేశారు. మరో వైపు ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మంచి రేటింగ్స్ ను రాబట్టుకుంటోంది. వీటిని చూసైనా కార్తీక దీపం మేకర్స్ మారతారేమో చూడాలి.
End of Article