సారీ చెప్పినట్లే చెప్పి మెలిక పెట్టిన సిద్ధార్థ్.. ఆ ఒక్క ట్వీట్ తో మళ్ళీ ఇచ్చిపడేసిన కస్తూరి..!

సారీ చెప్పినట్లే చెప్పి మెలిక పెట్టిన సిద్ధార్థ్.. ఆ ఒక్క ట్వీట్ తో మళ్ళీ ఇచ్చిపడేసిన కస్తూరి..!

by Anudeep

Ads

బాడ్ మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై టాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. సిద్ధార్థ్ విమర్శనాత్మక ట్వీట్స్ చేయడం ఇది మొదటి సారి కాదు. అయితే.. సిద్ధూ చేసిన ట్వీట్ పై నెటిజన్స్ తో సహా పలువురు సెలెబ్రిటీలు తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

Video Advertisement

ఈ ట్వీట్ పై స్పందించిన సిద్ధార్థ్ ఆమెను “కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్..” అని పేర్కొంటూ ట్వీట్ చేసాడు. ఇంత అవమానకరంగా సంబోధించడాన్ని శివసేన రాజ్య సభ ఎంపీ ప్రియాంక చతుర్వేదితో సహా పలువురు ఖండించారు.

siddu tweet 3

ఈ వ్యాఖ్యలను గృహలక్ష్మి నటి కస్తూరి కూడా విమర్శించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. సింగర్ చిన్మయి కూడా సిద్ధూ వాడిన పదజాలాన్ని వ్యతిరేకించింది. మరోవైపు సైనా నెహ్వాల్ తండ్రి కూడా సిద్ధార్థ్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసారు. దీనితో.. సిద్ధూ క్షమాపణ లేఖను రాసారు. తన అఫిషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా సైనా కు క్షమాపణ చెబుతున్నట్లు లేఖను రాసారు.

siddharth 1

ఈ లేఖ పై కూడా పలు చోట్ల విమర్శలు వస్తున్నాయి. ఇందులో క్షమాపణ చెప్పడం కంటే.. ఆయన ఇమేజ్ కి అయిన డామేజీ ని సరిచేసుకునే స్వార్ధమే కనిపిస్తోందని పలువురు నెటిజెన్స్ విమర్శిస్తున్నారు. “డియర్ సైనా.. నీ ట్వీట్ కు నేను ఇచ్చిన ప్రతిస్పందనలో నా జోక్ అసభ్యకరంగా ఉన్నందుకు క్షమించాలి. చాలా విషయాలలో నేను నీతో ఏకీభవించలేకపోవచ్చు. మీ ట్వీట్ చదివాక నాకు వచ్చిన కోపం, నిరాశ నేను వాడిన భాషని మాత్రం సమర్ధించలేవు.

siddu tweet 1

కానీ, నేను చేసిన జోక్ కి మాత్రం సమాధానం చెప్పాల్సి ఉంది. అది కచ్చితంగా మంచి జోక్ అయితే మాత్రం కాదు. అందుకు క్షమాపణ కోరుతున్న. నేను స్త్రీవాద మిత్రుడని. నా ట్వీట్ లో కచ్చితంగా లింగ వివక్ష మాత్రం లేదు… సారీ చెప్పినట్లే చెప్పి మెలిక పెట్టేసారు సిద్ధార్థ్. ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలకాలని.. ఈ క్షమాపణలని స్వీకరిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. దీనిపై ఓ నెటిజెన్ పబ్లిక్ ఫోరమ్ లో క్షమాపణలు చెప్పడానికి చాలా ధైర్యం ఉండాలని.. ఈ లేఖని బాగా రాసారని పేర్కొన్నారు. ఆ నెటిజెన్ కామెంట్ కి స్పందించిన కస్తూరి.. “ధైర్యమా..? అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోందని..” తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.


End of Article

You may also like