Ads
సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తరచూ వాళ్ళ ఫొటోస్ ని షేర్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. అలానే వాళ్ళ లైఫ్ లో ఏదైనా సందర్భం ఎదురవుతే దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది సెలబ్రిటీలు అయితే ఇంకొకరి మీద కామెంట్లు చేస్తూ ఉంటారు.
Video Advertisement
సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన చాలా విషయాలు బయటకి వస్తూనే ఉంటాయి. కొంత మంది స్టేజ్ల మీద కానీ ఏదైనా ఇంటర్వ్యూ లో కానీ మరొకరి గురించి చెప్తూ వుంటారు.
నటి కస్తూరి శంకర్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈమె అందరికీ సుపరిచితమే. ఎన్టీఆర్ గురించి వస్తున్న ట్రోల్స్ పై ఈమె స్పందించి షాకింగ్ కామెంట్స్ చేశారు. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గ్లోబల్ అవార్డ్స్ వేడుకల్లో ఎన్టీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే. అమెరికాలో ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడినప్పుడు అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడారు అది చూసి అక్కడ మీడియా ప్రతినిధులు చాలా షాక్ అయ్యారు.
కానీ ఎన్టీఆర్ మన ఇండియాలో ఇలా మాట్లాడరు. ఎన్టీఆర్ అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడడం వలన అక్కడ ఆయనని మెచ్చుకున్నా ఇక్కడ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో కస్తూరి మాట్లాడుతూ అమెరికా వాళ్ళకి వాళ్ల స్లాంగ్లో మాట్లాడితేనే అర్థం అవుతుంది కానీ ఇండియన్ ఇంగ్లీష్ లో మాట్లాడితే వారికి అర్థం కాదు. అందుకనే అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడారు ఎన్టీఆర్ అని చెప్పింది. అలానే ఎన్టీఆర్ చేసింది తప్పు కాదని చెప్పింది.
ఇండియాలో మాత్రం ఎన్టీఆర్ యాక్సెంట్ పూర్తిగా ఫేక్ అని ట్రోల్ చేయడం తప్పు అని ఎన్టీఆర్ కి సపోర్ట్ గా ఆమె తెలిపింది. పైగా ఆమె కూడా అమెరికాలో ఉంటున్నానని అక్కడ వాళ్ళకి ఏ విధంగా మాట్లాడితే అర్థం అవుతుంది అనేది తనకే తెలుసు అని చెప్పింది. యాంకర్ లక్ష్మి మంచు గురించి మాట్లాడుతూ ఆమెని చాలా మంది ట్రోల్ చేస్తున్నారని అన్నారు.
నిజమైన ప్రయత్నానికి కావాలని చేసే ఫేక్ ప్రయత్నానికి తేడా ఉంటుంది కదా అని కస్తూరి చెప్పింది. హైదరాబాద్ కి వచ్చి అటువంటి యాక్సెంట్ లో మాట్లాడితే తప్పకుండా ఎవరైనా ట్రోల్ చేస్తారని ఇక్కడ స్వచ్ఛమైన తెలుగు మాట్లాడొచ్చు కదా అని మంచు లక్ష్మి గురించి చెప్పింది కస్తూరి. అలానే ఎన్టీఆర్ తో తనని పోల్చొద్దని కూడా ఆమె చెప్పింది.
End of Article