తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి తెలిసిందే. తన ముక్కుసూటి మాటలతో ప్రత్యర్థి ఎంతటి వారైనా సరే చీల్చి చెండాడుతారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల శంఖారావం మోగడంతో కెసిఆర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోసారి తెలంగాణలో బిఆర్ఎస్ ని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హ్యాట్రిక్ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Video Advertisement

అంతేకాదు ఈసారి 95 నుంచి 105 స్థానాలు తమవే అని జోస్యం చెప్పారు.తాజాగా తన ప్రచారంలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు తనని మోసం చేశారని అన్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

24 ఏళ్ల క్రితం తన ఒక్కడినే బయలుదేరి వెళ్లానని, తన మిత్రులతో కలిసి మన బతుకు ఇంతేనాన్ని బాధపడే వాళ్ళని అన్నారు. మంజీరా నది ఎండిపోయి 800 ఫీట్ల లోతుకు బోర్ వేసిన నీళ్లు రాలేకపోయేవని అన్నారు. అప్పుడు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ బాగు చేయించుకోవడానికి చాలా ఇబ్బందులు పడేవాళ్ళమన్నారు.

27 మంది ఎమ్మెల్యేల సంతకాల చేయించుకుని ఎన్టీఆర్ దగ్గరికి వెళ్తే, అప్పటి విద్యుత్ సంస్థలన్నీ ఒప్పుకున్నాయి కానీ స్లాబ్ మాత్రం చేంజ్ చేయమని అన్నారు. ఆనాడు కరెంట్ బిల్లు పెంచమని చెప్పి చంద్రబాబు నాయుడు మోసం చేశారని విమర్శించారు. ఇక చూస్తూ కూర్చుంటే లాభం లేదని తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లుగా తెలియజేశారు.

Telangana Government Job Notification 2022

తెలంగాణ కోసం తన ప్రాణాల సైతం ఇవ్వడానికి సిద్ధపడే ముందుకు దిగానని అన్నారు.కొంతమందితో కలిసి ఉద్యమానికి శ్రీకారం చుడుతూ ముందుకొచ్చిన ఎవరూ తనతో కలిసి రాలేదని,నేను వస్తే కూడా జారుకున్నారని తెలిపారు. చివరికి పోరాటాలు చేసి తెలంగాణను సాధించుకున్నామని తెలిపారు.

watch video : 

Also Read:జగన్ ప్రభుత్వం మీద కేసీఆర్ ప్రశంసల వర్షం..! ఏం అన్నారంటే..?