Ads
కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాలి. తెలుగు ప్రేక్షకులని కూడ ఈ ముద్దుగుమ్మ బాగా ఆకట్టేసుకుంది. కీర్తి సురేష్ ఇమేజ్ అంతా మహానటి సినిమా తో పెరిగిపోయింది. ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేసి ఫిదా చేస్తూనే వుంది కీర్తి సురేష్.
Video Advertisement
మహానటి సినిమా తర్వాత చాలా ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ఈమె మాత్రం ఎక్కువగా పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేయడానికి ఒప్పుకుని.. వాటిలో మాత్రమే నటిస్తోంది. ఇది ఇలా ఉండగా సూపర్ స్టార్ రజినీ కాంత్ తో ‘అన్నాతే’ సినిమా చేయడానికి కీర్తి సురేష్ ఒప్పుకున్న సంగతి తెలిసిందే.
అన్నాతే లో సోదరి పాత్ర చేస్తోంది. రజనీకాంత్ కి చెల్లెలుగా ఈమె ఆ సినిమాలో కనపడనుంది. సూపర్ స్టార్ రజినీ కాంత్ ఎంత పెద్ద స్టార్ హీరోనో మనకి తెలుసు. అటు తమిళ్, ఇటు తెలుగు లో కూడ రజనీకాంత్ బాగా పాపులర్ అయ్యిపోయారు. ఈ సినిమా తెలుగులో పెద్దన్న పేరుతో విడుదల అయ్యింది. ఈ స్టార్ హీరోకి చెల్లెలిగా కీర్తి సురేష్ నటించడానికి కొన్ని సినిమాలని కూడ వదిలేసుకుందిట.
ఆ రెండు కూడా పెద్ద సినిమాలే. ఇక మరి ఆ సినిమాల వివరాల లోకి వెళితే.. ఈ మధ్యనే విడుదల అయిన శ్యామ్ సింగ రాయ్ సినిమాలో నటించే అవకాశాన్ని కేవలం ఈ సినిమా వల్లనే ఈ ముద్దుగుమ్మ వదిలేసుకుంది. శ్యామ్ సింగ రాయ్ సినిమాలో మొదట సాయి పల్లవి పాత్రకి కీర్తి సురేష్ ని సంప్రదించినట్లు సమాచారం. కానీ రజనీకాంత్తో నటించే అవకాశం రావడంతో కీర్తి సురేష్ ఈ సినిమా వైపు ఎక్కువగా ఆసక్తి చూపలేకపోయారు. ఇది ఇలా ఉంటే మణిరత్నం దర్శకత్వంలో రాబోతున్న పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించే అవకాశాన్ని కూడ అన్నాతే సినిమా కోసమే కీర్తి వదిలేసుకుంది.
End of Article