కీర్తి సురేష్ తల్లి చిరు సినిమాలో హీరోయిన్ గా నటించారు అని తెలుసా..? ఏ సినిమాలో అంటే..?

కీర్తి సురేష్ తల్లి చిరు సినిమాలో హీరోయిన్ గా నటించారు అని తెలుసా..? ఏ సినిమాలో అంటే..?

by Anudeep

Ads

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగు ఇండస్ట్రీ లో బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన “మహానటి” సినిమాలో నటించిన కీర్తి సురేష్ సావిత్రిని మరిపించింది. ఆ సినిమా చూస్తున్నంతసేపు మనకి కీర్తి సురేష్ కనిపించదు. సావిత్రి గారే కనిపిస్తారు. అంతలా ఆమె నటించి మెప్పించింది.

Video Advertisement

 

ప్రస్తుతం కీర్తి సురేష్ పలు తెలుగు సినిమా ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉంది. వాటిలో మెగాస్టార్ తో నటిస్తున్న సినిమా కూడా ఉంది. మెగాస్టార్ “భోళా శంకర్” సినిమాలో కీర్తి సురేష్ కూడా నటిస్తున్నారు.

keerthi mother 1

ఈ సినిమాలో కీర్తి సురేష్ మెగాస్టార్ కు చెల్లెలిగా నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇది ఇలా ఉంటే.. కీర్తి సురేష్ తల్లి మేనక, మెగాస్టార్ చిరు తో కలిసి సినిమాల్లో స్టెప్పులేశారన్న సంగతి తెలుసా..? కీర్తి సురేష్ తల్లి గురించి చాలా మందికి తెలియదు. ఆమె కూడా గతంలో టాలీవుడ్ లో హీరోయిన్ గా నటించారు. మెగాస్టార్ చిరంజీవి సరసన స్టెప్పులు కూడా వేశారు. ఇంతకీ.. ఆమె ఏ సినిమాలో నటించారో తెలుసుకుందాం.

keerthi mother 3

కీర్తి సురేష్ తల్లి మేనక.. మెగాస్టార్ సినిమాలో హీరోయిన్ గా నటించారు. గతంలో ఆమె స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు. 1980 ల కాలంలో వచ్చిన “పున్నమి నాగు” సినిమాలో మెగాస్టార్ పక్కన మేనక “పూర్ణిమ” అనే పాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆమె కూతురు కీర్తి సురేష్ మెగాస్టార్ కు చెల్లెలిగా నటించబోతున్నారు. “భోళా శంకర్” సినిమాకు మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.


End of Article

You may also like