“ఇక్కడ వదిలేస్తే నేను బతకలేను.. భయమేస్తోంది నాన్న..” వైరల్ అవుతున్న విస్మయ ఆడియో క్లిప్.. అసలేం జరిగిందంటే?

“ఇక్కడ వదిలేస్తే నేను బతకలేను.. భయమేస్తోంది నాన్న..” వైరల్ అవుతున్న విస్మయ ఆడియో క్లిప్.. అసలేం జరిగిందంటే?

by Anudeep

Ads

rచెందిన కిరణ్ కు విస్మయ ని ఇచ్చి వివాహం చేయాలనీ పెద్దలే నిర్ణయించారు. 2020 లో వీరి వివాహం జరిగింది. కిరణ్ కుమార్ ఆర్డీఏ లో ఇన్స్పెక్టర్ కావడం తో మంచి సంబంధం వచ్చిందని విస్మయ తల్లితండ్రులు మురిసిపోయారు. భారీ గా కట్నకానుకలు కూడా సమర్పించారు. అయితే.. వివాహం అయినా కొద్దిరోజులకే.. కట్నం కింద తనకు ఇచ్చిన కారుకి బదులు నగదు ఇవ్వాలని, అది కాకుండా అదనపు కట్నం తీసుకురావాలని కిరణ్ విస్మయ ను వేధించే వాడు.

Video Advertisement

ఓ సారి పార్టీ సందర్భం గా విస్మయ భర్త కిరణ్ తో కలిసి పుట్టింటికి వెళ్ళింది. అతిగా మద్యం సేవించిన కిరణ్ మద్యం మత్తులో తల్లితండ్రుల ముందే విస్మయ పై చేయి చేసుకున్నాడు. దీనితో అడ్డుపడిన విస్మయ అన్న పై కూడా దాడి చేసాడు. అప్పటినుంచి విస్మయ తల్లితండ్రుల వద్దే ఉండిపోయింది. ఆ తరువాత రెండు నెలల కిందటే బిఎంఎస్ పరీక్ష రాయడం కోసం విస్మయ కాలేజీ కి వెళ్ళింది. ఆ సమయం లోనే కిరణ్ ఆమెను బలవంతం గా ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి తిరిగి ఇంటికి పంపలేదు.

vismaya 1

ఆమెను హింసించడమే కాకుండా.. అదనపు కట్నం కోసం వేధించే వాడు. ఇందుకు సంబంధించిన దెబ్బల తాలూకు ఫోటోలను కూడా విస్మయ తనవాళ్లతో పంచుకుంది. అయితే.. కొన్నాళ్లకే ఆమె విగత జీవిగా మారడం తో పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమం లో నిందితుడిగా ఉన్న కిరణ్ కు శిక్ష కూడా విధించారు. అతన్ని ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా.. 304 బి, 498 ఏ, 306 . 323 , 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ఈ కేసుకు సంబంధించిన తీర్పుని నేడు ఇవ్వాల్సి ఉంది.

అయితే ఈ కేసుకు సంబంధించిన విచారణలో కీలకంగా మారిన ఆడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది. ఈ ఆడియో క్లిప్ లో విస్మయ చివరగా తన తండ్రితో మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇక్కడ వదిలేయద్దు నాన్నా.. భయమేస్తోంది.. అంటూ విస్మయ మాట్లాడుతున్న మాటలు వింటే ఎవరికైనా ఒళ్ళు జలదరిస్తుంది. ఈ దుర్ఘటనకు కారణమైన కిరణ్ ను కోర్టు తప్పకుండ శిక్షిస్తుందని విస్మయ కుటుంబ సభ్యులు, సన్నిహితులు భావిస్తున్నారు.

vismaya 2


End of Article

You may also like