తండ్రిని భుజాలపై మోస్తూ…ఆస్పత్రి నుండి ఇంటికి.! దానికి ముందు ఏం జరిగిందంటే?

తండ్రిని భుజాలపై మోస్తూ…ఆస్పత్రి నుండి ఇంటికి.! దానికి ముందు ఏం జరిగిందంటే?

by Anudeep

Ads

“కించిత్తు నల్లికుట్టినా మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతి” అన్న చందానా..ఎవరో ఒకరిద్దరు వ్యక్తులు చేసిన పొరపాట్లకు మొత్తం వ్యవస్థ చేసిన మంచి పనులన్ని గాలికి కొట్టుకుపోతాయి.  ప్రభుత్వం, డాక్టర్లు, పోలీసులు అందరూ కలిసి కృషి చేసి, కరోనాని ధైర్యంగా ఎదుర్కొంటూ దేశమంతా కేరళను ఆదర్శంగా తీసుకుంటున్న సమయంలో  ఒకరిద్దరు పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం మూలంగా యావత్ రాష్ట్ర ప్రభుత్వానికి తలవంపులు తీసుకొచ్చారు. అసలు విషయం ఏంటంటే..

Video Advertisement

పునలూర్​లోని కులతుపుజకు చెందిన  65ఏండ్ల  వ్యక్తిని అనారోగ్యం కారణంగా పునలూర్ తాలూకా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కుటుంబసభ్యులు. అతడితో పాటు , భార్య ,కొడుకు తోడుగా ఉన్నారు. అయితే అతడి ఆరోగ్యం మెరుగు పడడంతో హాస్పిటల్ వారు డిశ్చార్జి చేశారు.  తండ్రిని ఇంటికి తీసుకెళ్లేందుకు అతని కొడుకు ఆస్పత్రికి ఒక ఆటోను తీసుకెళ్లగా, అందులో ముగ్గురు ఇంటికి తిరుగు పయనమయ్యారు.మార్గమధ్యలో లాక్​డౌన్​ గైడ్​లైన్స్​కు వ్యతిరేకంగా ఆటో నడపరాదని పోలీసులు అడ్డుకున్నారు..

అతడి  ఆస్పత్రి డాక్యుమెంట్లు చూపించినా ఆటోను పోలీసులు వదల్లేదు. ఇంటికి మరో కిలోమీటర్​ దూరం ఉందనగా పోలీసులు ఆపేయడంతో  గత్యంతరం లేక ఒంటిపై షర్ట్ కూడా లేకుండా ఉన్న తండ్రిని భుజాలపై మోసుకుంటూ ట్రాఫిక్​ జామ్​లో నడుచుకుంటూ వెళ్లాడు కొడుకు. ఎండలో తండ్రిని భుజంపై మోసుకుని అతడు పరుగులు పెడుతూ వెళ్తుండగా, అతడి తల్లి వెనుకే హాస్పిటల్ రిపోర్ట్స్ బ్యాగ్ పట్టుకుని పరిగెడుతూ వెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలైంది..

హాస్పిటల్​ డాక్యుమెంట్లను చూపినా పోలీసులు తమ ఆటోను అనుమతించలేదని అతడు ఆరోపించాడు. ఇదిలా ఉండగా  “ఆటోను ఆపినప్పుడు అందులో పేషెంట్​ లేడని, ఆటోను ఆపిన తర్వాతే అతడు వెహికల్​ దిగి 200 మీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్​కు వెళ్లి.. వచ్చేటప్పుడు తన తండ్రిని భుజాలపై తీసుకుని వచ్చాడని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేరళ రాష్ట్ర హ్యూమన్​ రైట్స్​ కమిషన్​ సుమోటోగా కేసు నమోదు చేసింది.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కేరళ ప్రభుత్వం మాత్రమే కోవిడ్ -19ని సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ప్రజలకు సురక్షిత పాలనను అందిస్తున్నది. పేదలకు బియ్యం, పప్పులు,నూనె మొత్తం 17 రకాల వస్తువులు ఇవ్వడమే కాకుండా,  పనుల్లేకుండా ఉన్న కార్మికులకు సుమారు 46లక్షల మందికి 5000 చొప్పున జమ చేసింది. పాఠశాలల్లో మద్యాహ్న భోజనాన్ని, అంగన్వాడి పిల్లలకు ఇంటికే భోజనాన్ని పంపిస్తున్నది. వితంతు పించన్లు, వృద్దాప్య పించన్లు నెల ముందుగానే రెండు నెలలవి ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. ఇన్ని మంచి పనులు చేసిన కేరళ ప్రభుత్వానికి ఈ ఒక్క వార్త తలవంపులు తెచ్చింది.

మన తెలంగాణాలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది.. లాక్ డౌన్ పాటించని వారిని పోలీసులు చేతులెత్తి మొక్కుతూ లాక్ డౌన్ పాటించడయ్యా అని వేడుకుంటుంటూ, తాజాగా శంషాబాద్లో కూరగాయలమ్ముకుంటున్న రైతుల దగ్గర పోలీసులు దౌర్జన్యంగా కూరగాయలెత్తుకెళ్తున్న వీడియో ఒకటి బయటపడింది. పేదవాళ్లం బాబు అని ఆ రైతు వేడుకుంటున్న కనికరం లేకుండా కూరగాయలన్నింటిని పోలీసు జీపులో ఎక్కించుకుని వెళ్లిపోయారు..ఇలాంటి ఒకరిద్దరి మూలంగా మొత్తం వ్యవస్థకే నష్టం.

 


End of Article

You may also like