Ads
కొద్దికాలం క్రితం కేరళలో విస్మయ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తం గా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే, కేరళ, కొల్లం జిల్లా సస్తంకొట్ట కు చెందిన కిరణ్ కు విస్మయ ని ఇచ్చి వివాహం చేయాలనీ పెద్దలే నిర్ణయించారు. 2020 లో వీరి వివాహం జరిగింది. కిరణ్ కుమార్ ఆర్డీఏ లో ఇన్స్పెక్టర్ కావడం తో మంచి సంబంధం వచ్చిందని విస్మయ తల్లితండ్రులు మురిసిపోయారు. భారీ గా కట్నకానుకలు కూడా సమర్పించారు. అయితే.. వివాహం అయినా కొద్దిరోజులకే.. కట్నం కింద తనకు ఇచ్చిన కారుకి బదులు నగదు ఇవ్వాలని, అది కాకుండా అదనపు కట్నం తీసుకురావాలని కిరణ్ విస్మయ ను వేధించే వాడు.
Video Advertisement
ఓ సారి పార్టీ సందర్భం గా విస్మయ భర్త కిరణ్ తో కలిసి పుట్టింటికి వెళ్ళింది. అతిగా మద్యం సేవించిన కిరణ్ మద్యం మత్తులో తల్లితండ్రుల ముందే విస్మయ పై చేయి చేసుకున్నాడు. దీనితో అడ్డుపడిన విస్మయ అన్న పై కూడా దాడి చేసాడు. అప్పటినుంచి విస్మయ తల్లితండ్రుల వద్దే ఉండిపోయింది. ఆ తరువాత రెండు నెలల కిందటే బిఎంఎస్ పరీక్ష రాయడం కోసం విస్మయ కాలేజీ కి వెళ్ళింది. ఆ సమయం లోనే కిరణ్ ఆమెను బలవంతం గా ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి తిరిగి ఇంటికి పంపలేదు.
ఆమెను హింసించడమే కాకుండా.. అదనపు కట్నం కోసం వేధించే వాడు. ఇందుకు సంబంధించిన దెబ్బల తాలూకు ఫోటోలను కూడా విస్మయ తనవాళ్లతో పంచుకుంది. అయితే.. కొన్నాళ్లకే ఆమె విగత జీవిగా మారడం తో పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమం లో ఆమెను హింసించిన భర్త కిరణ్ పై చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదిక గా నెటిజన్లు నినాదాలు చేసారు.
ఈ కేసులో కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. విచారణ నిమిత్తం కోర్టు విధించిన 45 రోజులు గత శుక్రవారం తో ముగిసాయి. ఈ విచారణలో పోలీసులు సేకరించిన వివరాలు, ఆధారాలు, కిరణ్ ఇచ్చిన వాంగ్మూలం.. వీటన్నిటిని పరిశీలించిన కోర్టు తుది తీర్పు వెల్లడించింది. అతడు తన సర్వీస్ నిబంధనలను అతిక్రమించిన కారణం గా ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తగినశాస్తి జరిగింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
End of Article