“కేరింత” సినిమాలోని “భావన” గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

“కేరింత” సినిమాలోని “భావన” గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

by Mohana Priya

Ads

కొంత మంది యాక్టర్స్ చేసినవి కొన్ని సినిమాలే అయినా సరే ప్రేక్షకులకు మాత్రం చాలా గుర్తుండిపోతారు. అలా కేరింత సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై ఎంతో గుర్తింపు సంపాదించుకున్న నటి సుకృతి. సుకృతి అంటే చాలా మందికి గుర్తు రావడం కష్టం. భావన అంటే ఈజీగా స్ట్రైక్ అవుతారు. ఆ పాత్ర ప్రేక్షకులకు అంత గుర్తుండిపోయింది.

Video Advertisement

Kerintha movie actress sukrithi ambati

కేరింత సినిమాకి సాయి కిరణ్ అడివి దర్శకత్వం వహించగా, దిల్ రాజు గారు నిర్మించారు. ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, శ్రీ దివ్య, తేజస్వి, విశ్వంత్, పార్వతీశం కూడా ముఖ్య పాత్రలు పోషించారు. కేరింత సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమాలో భావన పాత్ర పోషించిన సుకృతి అంబటి ఢిల్లీలో పెరిగారు.

Kerintha movie actress sukrithi ambati

ఢిల్లీలోని కులచి హన్స్ రాజ్ స్కూల్ లో స్కూలింగ్ చేశారు. రాజస్థాన్ లోని బనస్థలి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివారు. బీటెక్ మూడవ సంవత్సరంలో ఉన్నప్పుడు థియేటర్స్ చేశారు. సినిమాలతో సంబంధం లేని బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన సుకృతి కి సినిమా ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదట.

Kerintha movie actress sukrithi ambati

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వాళ్లు కండక్ట్ చేసిన స్టార్ హంట్ లో ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యారు సుకృతి. సుకృతి  పోషించిన భావన పాత్ర రియాలిటీకి చాలా దగ్గరగా ఉండటంతో ఎంతోమంది రిలేట్ అయ్యారు. అందుకే ఇప్పటికి కూడా సుకృతి చాలా మందికి భావన లాగా గుర్తున్నారు. ఇంకొక మంచి పాత్రతో సుకృతి మళ్లీ మనల్ని అలరించాలని ఆశిద్దాం. ఇప్పుడు సుకృతి ఇలా ఉన్నారు.

Kerintha movie actress sukrithi ambati

Kerintha movie actress sukrithi ambati

Kerintha movie actress sukrithi ambati

 


End of Article

You may also like