KGF-2 కి ఇంత పవర్ ఫుల్ “డైలాగ్స్” రాసిన వ్యక్తి ఎవరో తెలుసా..? ఈ ఛాన్స్ ఎలా వచ్చిందంటే..?

KGF-2 కి ఇంత పవర్ ఫుల్ “డైలాగ్స్” రాసిన వ్యక్తి ఎవరో తెలుసా..? ఈ ఛాన్స్ ఎలా వచ్చిందంటే..?

by Mohana Priya

Ads

ఎన్నో రోజులు వెయిట్ చేసిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్-2 విడుదల అయ్యింది. కేజీఎఫ్ మొదటి భాగం ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయ్యింది. మొదటి భాగం మొత్తంలో కూడా రాకీ భాయ్ ఎలా ఎదిగాడు అనేది చూపించారు. రెండవ భాగంలో మాత్రం రాకీ భాయ్ ఎదిగిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది చూపించారు? మొదటి భాగంలాగానే ఈ సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది.

Video Advertisement

అసలు రాకీ భాయ్ ని జనాలు అందరూ అంత గుర్తు పెట్టుకునే అంతగా ఏం చేసాడు అనేది ఈ సినిమాలో చూపించారు. కానీ మొదటి భాగంతో పోలిస్తే ఈ సినిమాలో ఎమోషన్స్ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి. అలాగే విలన్ పాత్ర కూడా మనం చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది. కానీ యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ మాత్రం డైలాగ్స్.

kgf chapter 2 movie review

ఇది కన్నడ సినిమా అయినా కూడా డైరెక్ట్ తెలుగు సినిమా చూసినట్టు ఉంటుంది. అందుకు కారణం ఈ సినిమాలో ఉన్న డైలాగ్స్. తెలుగు సినిమాలో ఉన్నట్టే ఉంటాయి. దాంతో డైరెక్ట్ తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమాకి తెలుగులో డైలాగ్స్ రాసిన వ్యక్తి పేరు హనుమాన్ చౌదరి. హనుమాన్ చౌదరి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను రవిబాబు దర్శకత్వంలో కొన్ని సినిమాలకి పని చేశాను అని చెప్పారు. కైకాల సత్యనారాయణ కొడుకు నుండి దర్శకుడు ప్రశాంత్ నీల్ ని కలిసే అవకాశం దొరికింది అని చెప్పారు.

kgf 2 telugu dialogue writer hanuman chowdary

తెలుగు డబ్బింగ్ లో నేటివిటీని దృష్టిలో పెట్టుకొని డైలాగ్స్ రాయాలని ప్రశాంత్ నీల్ చెప్పారట. ఇది దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకి డైలాగ్స్ రాశారట. అనుకున్నట్టుగానే సినిమాలో డైలాగ్స్ మన నేటివిటీకి తగ్గట్టు గానే ఉంటాయి. ప్రేక్షకులకి ఈ సినిమా ఇంకా బాగా నచ్చింది. ఈ సినిమాలో నటించిన వారికి మాత్రమే కాకుండా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పాటు సినిమాకి పని చేసిన వారికి కూడా చాలా మంచి పేరు వచ్చింది. వీరిలో చాలా మంది కొత్తవారు లేదా ఇప్పుడు కూడా పైకి వస్తున్న వారు కావడం విశేషం. ఈ సినిమాతో వారందరికీ కూడా పాన్ ఇండియన్ రేంజ్ గుర్తింపు వచ్చింది.

watch video :


End of Article

You may also like