Ads
- చిత్రం : కేజీఎఫ్ చాప్టర్ – 2
- నటీనటులు : యష్, శ్రీ నిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీ రావు.
- నిర్మాత : విజయ్ కిరగందూర్
- దర్శకత్వం : ప్రశాంత్ నీల్
- సంగీతం : రవి బస్రూర్
- విడుదల తేదీ : 14 ఏప్రిల్, 2022
Video Advertisement
స్టోరీ :
మొదటి భాగం ముగిసిన దగ్గర నుండి రెండవ భాగం మొదలవుతుంది. ఆనంద్ (అనంత్ నాగ్) కొడుకైన విజయేంద్ర (ప్రకాష్ రాజ్) కథని చెప్తూ ఉంటాడు. రాకీ భాయ్ (యష్) కేజీఎఫ్ కి రూలర్ అవుతాడు. అధీరా (సంజయ్ దత్) రాకీ భాయ్ కి ఒక కొత్త చాలెంజ్ చేస్తాడు. ఈ క్రమంలో వారిద్దరికి మధ్య గొడవలు మొదలవుతాయి. రాకీ భాయ్ ఎప్పుడైతే తాను గెలుస్తున్నాడు అని అనుకుంటాడో అప్పుడు ఇంకా కొత్త గొడవలు మొదలవుతాయి. అందులో రాజకీయవేత్త రమికా సేన్ (రవీనా టాండన్) తో కూడా గొడవలు ఉంటాయి. ఈ గొడవలు అన్నిటిని రాకీ భాయ్ ఎలా పరిష్కరించాడు? వారందరికీ రీనా (శ్రీనిధి శెట్టి) కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరికి రాకీ భాయ్, రీనా కలిసారా? రాకీ భాయ్ గెలిచాడా? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
కేజీఎఫ్ మొదటి భాగం ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయ్యింది. మొదటి భాగం మొత్తం లో కూడా రాకీ భాయ్ ఎలా ఎదిగాడు అనేది చూపించారు. రెండవ భాగంలో మాత్రం రాకీ భాయ్ ఎదిగిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది చూపించారు? మొదటి భాగంలాగానే ఈ సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది. అసలు రాకీ భాయ్ ని జనాలు అందరూ అంత గుర్తు పెట్టుకునే అంతగా ఏం చేసాడు అనేది ఈ సినిమాలో చూపించారు. కానీ మొదటి భాగంతో పోలిస్తే ఈ సినిమాలో ఎమోషన్స్ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి. అలాగే విలన్ పాత్ర కూడా మనం చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది. కానీ యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు.
సినిమా కూడా చూడటానికి చాలా రిచ్ గా కనిపిస్తూ ఉంటుంది. పర్ఫామెన్స్ విషయానికి వస్తే రాకీ భాయ్ పాత్రలో యష్ చాలా సులభంగా చేశారు. ఆ పాత్ర యష్ కోసం చేశారేమో ఉన్నట్టే అనిపిస్తుంది. అలాగే విలన్ పాత్రలో నటించిన సంజయ్ దత్ కూడా గెటప్ పరంగా చాలా కొత్తగా కనిపించారు. హీరోయిన్ శ్రీ నిధి శెట్టి తన పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. కానీ శ్రీ నిధి శెట్టి పాత్రతోనే ట్విస్ట్ ఉంటుంది. అలాగే రవీనా టాండన్ కూడా రాజకీయవేత్తగా బాగా చేశారు. ముఖ్య పాత్రల్లో నటించిన ఈశ్వరి రావు, మాళవిక అవినాష్, రావు రమేష్ కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు. ఈ సినిమాలో అనంత్ నాగ్ స్థానంలో ప్రకాష్ రాజ్ కనిపిస్తారు. మొదటి భాగంలో అనంత్ నాగ్ పాత్ర ఇచ్చిన ఎలివేషన్స్ హైలైట్ అయ్యాయి. ఆనంద్ పాత్ర పోషించిన అనంత్ నాగ్ కొడుకు అయిన విజయేంద్ర అనే పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపిస్తారు. ఈ పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ కూడా సినిమా ముందుకు వెళ్లడంలో ఒక ముఖ్య పాత్ర పోషించారు.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటుల పెర్ఫార్మెన్స్
- యాక్షన్ సీన్స్
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- బలహీనంగా ఉన్న హీరో – హీరోయిన్ లవ్ ట్రాక్
- స్లోగా నడిచే సెకండ్ హాఫ్
రేటింగ్ :
3.5/5
ట్యాగ్ లైన్ :
ఒక సినిమాకి సీక్వెల్ వస్తే, ఆ సీక్వెల్ మొదటి భాగానికి న్యాయం చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కేజీఎఫ్ చాప్టర్ – 2 విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమా జనాల అంచనాలని ఖచ్చితంగా అందుకుంది.
End of Article