Ads
కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి గురించి తెలిసింది. కేజిఎఫ్1, కేజీఎఫ్ 2 సినిమాలతో ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించుకుంది. కన్నడ స్టార్ హీరో యష్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ సినిమాల్లో నటించిన వారు, పనిచేసిన వారందరికీ మంచి మంచి ఆఫర్లు వచ్చాయి.
Video Advertisement
డైరెక్టర్ ప్రశాంత్ నీలైతే ఏకంగా ఇండియన్ బాహుబలి ప్రభాస్ తో సలార్ సినిమా తెరకెక్కిస్తున్నారు. హీరో యాష్ అయితే ఇంకా ఏ ప్రాజెక్టును ప్రకటించినప్పటికీ కథల వేటలో ఉన్నారు.హీరోయిన్ శ్రీనిధి శెట్టి కి కూడా మంచి ఆఫర్లు వచ్చాయి. తమిళ్ హీరో విక్రమ్ సరసన ఒక సినిమాలో నటించిన అది పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు.
తాజాగా ఈ బ్యూటీ మరో రెండు సినిమాలను ప్రకటించింది. తెలుగులో స్టార్ బాయ్స్ సిద్దు జొన్నలగడ్డ మూవీలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి అవకాశం దొరికింది. ఇదిలా ఉంటే కన్నడ సూపర్ స్టార్ సుదీప్ కొత్త సినిమాలోని శ్రీనిధి శెట్టి ఛాన్స్ కొట్టేసింది. తాజాగా ఈ సినిమా టీం ఈ విషయాన్ని ప్రకటించింది.కన్నడ స్టార్ హీరో సుదీప్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది.
ఈగ సినిమాలో విలన్ గా సుదీప్ నటనను మర్చిపోలేము. బాహుబలి సినిమాలో కూడా సుదీప్ కీలక పాత్రలో నటించి మెప్పించారు.తర్వాత సుదీప్ నటించిన ప్రతి సినిమా తెలుగులో డబ్ అవుతుంది. తాజాగా విక్రాంత్ రోనా కూడా ఇక్కడ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.
ఇప్పుడు సుదీప్ హీరోగా తమిళ దర్శకుడు చేరన్ డైరెక్షన్ లో ఒక సినిమా వస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి ని ఎంపిక చేశారు. చేరన్ తమిళ్ లో మంచి హిట్ సినిమాలను తరికెక్కించారు. 2017 తర్వాత దర్శకత్వానికి విరామం ఇచ్చిన ఇయన మళ్లీ ఆరేళ్ల తర్వాత కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సత్య జ్యోతి ఫిలిం ఈ సినిమాను నిర్మించనుంది.అయితే కేజిఎఫ్ తర్వాత సరైన హిట్ లేని హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఈ సినిమా మీదే తన ఆశలు పెట్టుకుంది.
Also Read:భలే ప్లాన్ చేశారుగా జక్కన్నా..? “మహేష్ బాబు-రాజమౌళి” సినిమా కథ ఇదేనా..?
End of Article