భలే ప్లాన్ చేశారుగా జక్కన్నా..? “మహేష్ బాబు-రాజమౌళి” సినిమా కథ ఇదేనా..?

భలే ప్లాన్ చేశారుగా జక్కన్నా..? “మహేష్ బాబు-రాజమౌళి” సినిమా కథ ఇదేనా..?

by Anudeep

Ads

‘సర్కారు వారి పాట’ చిత్రం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ ఒక మూవీ చేయబోతున్నట్లు గతంలోనే ప్రకటించారు.

Video Advertisement

‘ఆర్ ఆర్ ఆర్ ‘ మూవీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత రాజమౌళి మహేష్ తో సినిమా చేయనున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ అని రాజమౌళి ప్రకటించారు. దీనికి రాజమౌళి తండ్రి, రచయిత కెవి విజయేంద్ర ప్రసాద్ కథను అందించనున్నారు.

is this is the story line of mahesh-rajamouli movie
ఈ నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ లైన్ కు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మహేష్ తో తానూ చేయబోయే చిత్రం ‘గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్’ అని రాజమౌళి వెల్లడించారు. గ్లోబ్ ట్రోటింగ్ అంటే ‘ప్రపంచాన్ని చుట్టి రావడం’. అంటే ఈ చిత్రంలో మహేష్ ప్రపంచ యాత్రికుడిగా కనిపిస్తారని సమాచారం. ఆ నేపథ్యంలో మహేష్ బాబు పాత్ర ఎదుర్కొనే సంఘటనలు అలాగే అక్కడ ఏమవుతుంది అనే అంశం చుట్టూ సినిమా తిరుగుతుంది. గతంలో రాజమౌళి తండ్రి కెవి విజయేంద్ర ప్రసాద్, మహేష్ బాబుతో ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ కు సంబంధించిన కథా ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.

is this is the story line of mahesh-rajamouli movie
ఈ చిత్రం గురించి మహేష్ గతం లో ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “కథ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడే సినిమా గురించి మాట్లాడటం తొందర అవుతుంది. కానీ ఎస్ఎస్ రాజమౌళి తో కలిసి పని చేయాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాను. చివరికి నా కల నెరవేరబోతోంది. నేను చాల ఎక్సయిట్ గా ఉన్నాను” అన్నారు. ఈ సినిమా కథ హాలీవుడ్ సినిమా జేమ్స్ బాండ్ తరహాలో ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తుది కథ ఇంకా పూర్తి కాలేదని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇంకా ప్రారంభం కాని ఈ సినిమాను ఏడాది లోపే షూటింగ్ ని పూర్తి చేయాలని రాజమౌళి ప్లాన్ చేసినట్లు సమాచారం.

is this is the story line of mahesh-rajamouli movie
ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కెఎల్ నారాయణ తన శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్‌ప్లే కూడా అందించనున్నారు. సినిమా కథ, బడ్జెట్ మొదలైన వాటి గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


End of Article

You may also like