Ads
ఎన్నో రోజులు వెయిట్ చేసిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్-2 విడుదల అయ్యింది. కేజీఎఫ్ మొదటి భాగం ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయ్యింది. మొదటి భాగం మొత్తంలో కూడా రాకీ భాయ్ ఎలా ఎదిగాడు అనేది చూపించారు. రెండవ భాగంలో మాత్రం రాకీ భాయ్ ఎదిగిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది చూపించారు? మొదటి భాగంలాగానే ఈ సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది.
Video Advertisement
అసలు రాకీ భాయ్ ని జనాలు అందరూ అంత గుర్తు పెట్టుకునే అంతగా ఏం చేసాడు అనేది ఈ సినిమాలో చూపించారు. కానీ మొదటి భాగంతో పోలిస్తే ఈ సినిమాలో ఎమోషన్స్ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి. అలాగే విలన్ పాత్ర కూడా మనం చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది. కానీ యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు.
ఈ సినిమాకి ప్రధాన హైలైట్స్ లో మ్యూజిక్ ఒకటి. ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందించారు. ఇంక నేపథ్య సంగీతం అయితే సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. రవి బస్రూర్ 2012 లో సంగీత దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టారు. అయితే రవి సినిమాల్లోకి రాకముందు శిల్పాలు చెక్కేవారు. తన 14వ సంవత్సరంలో రవి బెంగళూరు కి వెళ్ళిపోయి శిల్పాలు చెక్కడం నేర్చుకుని అలాగే కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో కొంతమందితో మాట్లాడి సినిమాకి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకున్నారు.
తర్వాత ముంబై వెళ్లి అక్కడ శిల్పాలు చెక్కుతూ సంగీతానికి సంబంధించి కూడా అవకాశాల కోసం వెతకడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి తర్వాత పోయాయి. ఒకదానిక సమయంలో హాస్పిటల్ కి వెళ్లి కిడ్నీ కూడా అమ్మేయాలి అనుకున్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల బెంగళూరుకి తిరిగి వచ్చేసారు. అక్కడ కూడా శిల్పాలు చెక్కారు. ఆ తర్వాత రేడియో స్టేషన్ లో ఉద్యోగం సంపాదించి అక్కడి నుంచి అంచలంచలుగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారు.
End of Article