Ads
2018 లో విడుదలైన కేజిఎఫ్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. ఇది డబ్బింగ్ సినిమా అయినా కూడా ఒక డైరెక్ట్ తెలుగు సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తామో, అంతే ఆసక్తితో కేజిఎఫ్ సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. బహుశా బాహుబలి తర్వాత మనం అంతగా ఎదురు చూసే సీక్వెల్ కేజిఎఫ్ ఏమో.
Video Advertisement
అసలు రాకీ భాయ్ ఏం చేశాడు? అధీరా క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? ప్రకాష్ రాజ్ పాత్ర ఏంటి? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ సీక్వెల్ ఇవ్వబోతోంది. ఈసారి సీక్వెల్ లో అధీరా గా సంజయ్ దత్, రామికా సేన్ గా రవీనా టాండన్, అలాగే మరొక ముఖ్య పాత్రలో ప్రకాష్ రాజ్ కూడా యాడ్ అయ్యారు.
ఇప్పటికే యష్, సంజయ్ దత్, రవీనా టాండన్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి లుక్స్ కి సంబంధించిన పోస్టర్స్, అలాగే ప్రకాష్ రాజ్ షూట్ లో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సినిమాలో కొన్ని పాత్రల ప్రజెన్స్ లేకపోయినా కూడా వాళ్ల పాత్ర సినిమా మొత్తం కంటిన్యూ అవుతుంది. అందులో ముందుగా ఉన్న పాత్ర రాకీ భాయ్ తల్లి.
అసలు రాకీ భాయ్ పాత్ర డెవలప్ అవ్వడానికి ముఖ్యకారణం తన తల్లి చెప్పిన మాటలే. రాకీ భాయ్ తల్లి శాంతమ్మ పాత్రలో నటించారు అర్చన జోయిస్. అర్చన పోషించిన పాత్ర సినిమాకి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. అంత ఇంపార్టెంట్ పాత్రని అంతే బాగా హ్యాండిల్ చేశారు అర్చన. అర్చన విజయ రథ, కాలాంతక సినిమాల్లో నటించారు.
సాధారణంగా సినిమాలో పాత్రకి తగ్గట్టు రెడీ అవ్వడం వల్ల, యాక్టర్స్ రియల్ లైఫ్ ఫీచర్స్ కి, సినిమాలో ఉన్న దానికి చాలా తేడా ఉంటుంది. అలాగే అర్చన రియల్ లైఫ్ ఫొటోస్ చూస్తే, అసలు మనం సినిమాలో చూసిన అర్చనకి, నిజ జీవితంలో ఉన్న అర్చనకి చాలా డిఫరెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆమె వయసు 25 సంవత్సరాలు మాత్రమే. అంత చిన్న వయసులోనే అమ్మ పాత్రలో నటించి మెప్పించడం సాధారణ విషయం కాదు.
End of Article