పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా అందరికీ గుర్తే. పవర్ స్టార్ కి ఈ సినిమా మాములు క్రేజ్ తీసుకు రాలేదు. క్రేజ్ ని రెట్టింపు చేసేసి ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయే సినిమా ఇది. ఈ సినిమా తరవాత పదేళ్లు దాకా మంచి హిట్ పవర్ స్టార్ కి లేక పోయినా సరే ఆయన పేరు అలానే వుంది.

Video Advertisement

ఈ సినిమా లో పవన్‌ భూమిక కెమిస్ట్రీ చాలా బాగుంది. సిద్దు సిద్ధార్ధ రాయ్ అని పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ కూడా బాగా పాపులర్ అయ్యింది.

did you notice this in pavan kalyan khushi movie..

విజయ్, జ్యోతిక జంటగా నటించిన తమిళ్ సినిమా ఇది. కోలీవుడ్ లో సక్సెస్ అవ్వడం వలన తెలుగు లో కూడా ఎస్‌జే సూర్య పవన్ కళ్యాణ్ తో ఈ మూవీ ని తీశారు. అయితే ఈ మూవీ లో కొన్ని మార్పులు చేసారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఉండేలా మార్చారు. అలానే మన తెలుగు నేటివిటీ కి సెట్ అయ్యే లాగ మార్చారు. యూత్ అయితే ఈ సినిమా కి బాగా కనెక్ట్ అయ్యిపోయారు. ఇప్పుడు ఎక్కడ చూసిన ఖుషి మోతమోగిపోతోంది. రీ రిలీజ్ చేసారు. మళ్ళీ ఖుషి సినిమా చూసి పవన్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

మొదటి రోజు నాలుగున్నర కోట్లు వచ్చాయి ఈ సినిమాకి. అదే రెండవ రోజు అయితే కోటిన్నరకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇక ఎంత కలెక్షన్లని ఈ సినిమా రాబట్టింది అనేది చూస్తే.. ఓవర్సీస్+ ఇతర రాష్ట్రాలు లో ఖుషి సినిమా కి మొదటి రోజు రూ. 4.15 కోట్ల గ్రాస్ రాగ.. జల్సా కి రూ. 3.20 కోట్ల గ్రాస్ వచ్చింది. పోకిరి కి అయితే రూ. 1.73 కోట్ల గ్రాస్, చెన్నకేశవ రెడ్డి రూ. 1.10 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. నైజాం తో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఖుషీ సినిమా రీ రిలీజ్ లో మొదటి స్థానం లో నిలిచింది. అలానే డిసెంబర్ 31న విడుదలైన జల్సా సినిమా మన తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 3.62 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. రెండో రోజు 1.52 కోట్ల గ్రాస్ వచ్చింది.