Ads
మనం సినిమాలలో చూస్తూనే ఉంటాం. కొన్ని హారర్ మూవీస్ లో దెయ్యాలు ఎక్కువ గా చిన్నపిల్లలకు కనబడుతూ ఉంటాయి. వారికి అవేమి తెలియక వాటితో మాములుగా మాట్లాడేస్తునో, నవ్వుతూనే ఉంటారు. ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే రియల్ లైఫ్ లో కూడా చోటు చేసుకుంది. లాస్ వెగాస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
Video Advertisement
లాస్ వెగాస్‌లో టారీ మెక్కెంజీ అనే మహిళకు అంబర్ అనే ఓ మనవరాలు ఉంది. ఆ పసి పాప గత కొన్ని రోజులు గా వింత గా ప్రవర్తిస్తుండడాన్ని టారీ మెక్కెంజీ గమనించారు. ఉన్నట్లుండి ఆ పాప నవ్వుతుండడం, హఠాత్తుగా ఏడుస్తుండడం వంటివి చేస్తుండడం తో ఆమె అనుమానం మరింత బలపడింది. దీనితో ఆమె ముందు జాగ్రత్త కోసం సిసి కెమెరా ఫుటేజీ ని పరిశీలించింది. అయితే, అందులో ఆమెకి ఏమి కనిపించలేదు.
ఆ తరువాత కూడా ఆ పాప ప్రవర్తన మరింత వింతగా మారిపోవడం తో టారీ మెక్కెంజీ కి కంగారు పుట్టింది. మరోసారి సిసి కెమెరా ఫుటేజీ చెక్ చేసి ఆమె షాకయింది. ఆ ఫుటేజీ లో ఓ వింత ఆకారం ఆమెకి కనబడింది. తలకు కొమ్ములు, చేతికి బారు గోర్లను ఆమె గమనించింది. దీనితో, ఆమె ఫుటేజీ లోని ఫోటోలను స్క్రీన్ షాట్ లు తీసి పరిశోధకులకు పంపడం తో ఇవి బయటకు వచ్చాయి.
తనకు ఫోటో షాప్ చేయాల్సి న అవసరం లేదని, అందుకే వీటిని సోషల్ మీడియా లో అప్ లోడ్ చేయకుండా పరిశోధకులకు పంపానని ఆమె చెప్పుకొస్తోంది. మొత్తానికి, ప్రస్తుతం ఇదొక మిస్టరీ గా మిగిలింది.
End of Article