జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు . ఎన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చినా ఆ ప్రోగ్రామ్ పంథా దానిదే , ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా షో నిర్వాహకుల మొదలుకొని పార్టిసిపెంట్స్ వరకు తమకు నచ్చినట్టుగానే వ్యవహరిస్తున్నారు .ఈ మధ్యకాలంలో జబర్దస్త్లో ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా కిర్రాక్ ఆర్పి జబర్దస్త్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.

Video Advertisement

టెలివిజన్ రంగంలో కామెడీ షోల వరకు వస్తే జబర్దస్త్ కి ముందు జబర్దస్త్ కి తర్వాత అనుకునే పరిస్థితి షో స్టార్ట్ అయిన కొత్తలో ఇంతగా సూపర్ హిట్ అవుతుందని ఊహించిఉండరు .అణకువగా ఉండే యాంకరింగ్ రంగానికి గ్లామర్ మెరుపులని తీసుకొచ్చింది జబర్దస్తే . ఈ షోలో అనసూయ,రశ్మిల స్కిన్ షో నెవ్వర్ బిఫోర్,ఎవర్ ఆఫ్టర్ .కామెడీ షో కాస్త బూతుషో గా కామెంట్స్ మూటకట్టుకుంది.ఒకవైపు ఎన్నో విమర్శలు అయినప్పటికి షో టిఆర్పీ రేటింగ్స్ మాత్రం ఎక్కడా తగ్గకుండా ఉన్నాయి.

అయితే సినిమా రంగంలో అవకాశాలు లేని కాలంలో ఎందరో కమెడియన్స్ కి జీవితాన్నిచ్చింది జబర్దస్త్ షో అనేది నిజం . జబర్దస్త్ షో తోనే లైఫ్లో సెటిల్ అయిన కమెడియన్స్ ఎందరో . ఈ షోతోనే లైమ్ లైట్లోకి వచ్చిన కమెడియన్స్ ఉన్నారు. జబర్దస్త్ తో పాటు ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ మరికొంత మంది కమెడియన్స్ ని తీసుకొచ్చి, అటు యాంకర్స్ అనసూయ , రశ్మిలకు ఇద్దరికి ఒక్కో రోజు ఇచ్చి న్యాయం చేసింది. కానీ ఇదే విషయంపై కిర్రాక్ ఆర్పి కామెంట్ చేశారు.

ఖాళీగా కూర్చున్న ఆర్పిని తీసుకొచ్చే షో వాళ్లేం అవకాశాలు ఇవ్వలేదు . మా అవసరం వారికి ఉంది, వారి అవసరం మాకుంది . అంతవరకే, అంతే కాని మాకు అవకాశాలిచ్చి మమ్మల్ని నిలబెట్టింది అనడం సరైనది కాదు. మాకు లైఫ్ ఇచ్చింది అనే పదం చాలా పెద్దది అంటూ ఘాటుగా రెస్పాండ్ అయ్యాడు.

ఇటీవల జబర్దస్త్ షో నుండి బయటికి వచ్చిన ఆర్పి మళ్లీ అటువైపు అడుగు పెట్టనని సీరియస్ గా చెప్పాడు. షో నుండి నాగబాబు బయటికి వచ్చి జబర్దస్త్ ని విమర్శిస్తూ  విడతల వారిగా వీడియోలు పెట్టడం పెద్ద షాకింగ్ . జబర్దస్త్ సీనియర్ కంటెస్టంట్స్ కొందరు , నాగబాబు జీలో అదిరింది షో చేస్తున్న సంగతి తెలిసిందే . ఇదే షోకి ఆర్పి వెళ్లాడు .

కొసమెరుపేంటంటే జబర్దస్త్ ఆర్టిస్టులే చేస్తున్నప్పటికి అదిరింది షోలో అస్సలు పసలేకపోవడం, మరోవైపు పాత స్కిట్లే ప్రదర్శిస్తున్నప్పటికి జబర్దస్త్ సూపర్ డూపర్ గా దూసుకుపోవడం .. అదిరింది కాదు దానికంటే ముందు జబర్దస్త్ పంథాలో వచ్చిన ఎన్నో షోస్ మద్యలోనే మాయమయ్యాయి . అన్నింటిని ధీటుగా తట్టుకుంటూ నిలబడడం మామూలు విషయం కాదు.