Ads
వరుస సినిమాలు చేస్తూ తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న హీరో కిరణ్ అబ్బవరం. సినిమా టాక్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వస్తూ ఉంటారు. ఇప్పుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రూల్స్ రంజన్ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : రూల్స్ రంజన్
- నటీనటులు : కిరణ్ అబ్బవరం, వెన్నెల కిషోర్, నేహా శెట్టి.
- నిర్మాత : దివ్యాంగ్ లావానియా, మురళీ కృష్ణ వేమూరి
- దర్శకత్వం : రతినం కృష్ణ
- సంగీతం : అమ్రీష్
- విడుదల తేదీ : అక్టోబర్ 6, 2023
స్టోరీ :
మనోరంజన్ (కిరణ్ అబ్బవరం) ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. యావరేజ్ స్టూడెంట్ అయిన మనోరంజన్, ఎంతో కష్టపడి క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ సంపాదిస్తాడు. ఉద్యోగం కోసం ముంబైకి వెళ్తాడు. ముందు హిందీ రాకపోయినా తర్వాత నేర్చుకొని టీం లీడర్ గా ఎదుగుతాడు. తర్వాత నుండి ఆఫీస్ లో రూల్స్ పెట్టడం మొదలు పెడతాడు. అందుకే అతనికి రూల్స్ రంజన్ అని పేరు వస్తుంది. అనుకోకుండా కొన్ని పరిస్థితుల వల్ల మనోరంజన్ తన కాలేజ్ స్నేహితురాలు అయిన సన (నేహా శెట్టి) ని కలుస్తాడు.
మనోరంజన్ సనని ఎప్పుడో కాలేజ్ లో చదువుకునేటప్పుడే ప్రేమించినా కూడా భయంతో ఈ విషయాన్ని బయట పెట్టడు. తర్వాత ఇప్పుడు కలిసినప్పుడు ఈ విషయాన్ని సనతో చెప్తాడు. సన కూడా మనోరంజన్ ప్రేమని అంగీకరిస్తుంది. తర్వాత మళ్లీ సన దూరం అయిపోతుంది. అప్పుడు మనోరంజన్ ఏం చేశాడు? మనోరంజన్ ని ప్రేమించిన సన మరొకరిని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? ఈ పెళ్లిని మనోరంజన్ ఎలా ఆపాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
రాజా వారు రాణి గారు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కిరణ్ అబ్బవరం. అప్పటి నుండి ఇప్పటి వరకు వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఆ సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకే తన నెక్స్ట్ సినిమా ప్రకటించేస్తున్నారు. అంత ఫాస్ట్ గా ఉన్నారు. ఈ రూల్స్ రంజన్ అనే సినిమా ఎప్పుడో ప్రకటించారు. ఈ సినిమా ముందే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడి ఇవాళ రిలీజ్ అయ్యింది.
సినిమా కథ విషయానికి వస్తే చాలా బలహీనంగా ఉంది. దర్శకుడు ఏం చెప్పాలి అనుకున్నాడు? అసలు ఏం చెప్పాడు? ఒక్క ముక్క కూడా అర్థం అవ్వదు. సినిమా ముందుకి వెళ్తున్న కొద్ది అసలు కన్ఫ్యూజన్ అవుతుంది అనే విషయం పక్కన పెడితే, సినిమా ఎప్పుడు అయిపోతుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. కామెడీ ట్రై చేశారు. ఒకటి రెండు చోట్ల తప్ప అది కూడా పెద్దగా పేలలేదు.
ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమా ఎలా ఉన్నా కూడా కిరణ్ అబ్బవరం ప్రతి సినిమాకి తనని తాను మార్చుకునే విధానం మాత్రం బాగుంటుంది. ఈ సినిమాలో ముందు సినిమాలతో పోలిస్తే కాస్త డిఫరెంట్ గా ఉన్న పాత్ర పోషించారు. తన పాత్ర వరకు తను బానే చేశారు. నేహా శెట్టి గ్లామరస్ గా కనిపించారు. నటనకి ఆస్కారం ఉన్న పాత్ర అయితే కాదు.
పాటలు కూడా గుర్తు పెట్టుకునే అంత గొప్పగా ఏమీ లేవు. శ్రేయ ఘోషల్ పాడిన సమ్మోహనుడా పాట తప్ప మిగిలినవి ఏమి గుర్తు ఉండవు. పాటలనే కాదు, అసలు సినిమా మొత్తం కూడా ఈ పాట తప్ప వేరే ఏది గుర్తుండదు. నిర్మాణ విలువలు పర్వాలేదు. లవ్ ట్రాక్ కూడా బాగాలేదు అని చెప్పలేము. అలా అని బాగుంది అని కూడా అనలేము. కానీ మరి తీసి పడేసే అంతగా ఏమీ లేదు. కానీ సినిమాకి అది పెద్దగా హెల్ప్ కూడా అవ్వలేదు.
ప్లస్ పాయింట్స్ :
- లవ్ ట్రాక్
- నేహా శెట్టి
- కొన్ని కామెడీ సీన్స్
- సమ్మోహనుడా పాట
మైనస్ పాయింట్స్:
- బలహీనమైన కథ
- ఫ్లాట్ గా ఉన్న స్క్రీన్ ప్లే
- సహనానికి పరీక్ష పెట్టే సీన్స్
- చిత్రీకరించిన విధానం
రేటింగ్ :
2/5
ట్యాగ్ లైన్ :
కిరణ్ అబ్బవరం ప్రతి సినిమాకి తనని తాను కొత్తగా ప్రజెంట్ చేసుకోవాలి అని తాపత్రయ పడుతున్న నటుల్లో ఒకరు. ఈ సినిమాకి కూడా అలాగే కొత్తగా కనిపించడానికి ప్రయత్నించారు. తన ప్రయత్నం వరకు బాగానే ఉన్నా కూడా బలహీనమైన కథనం వల్ల రూల్స్ రంజన్ సినిమా పెద్దగా అలరించని సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : అదే కాన్సెప్ట్ తో వచ్చిన మన తెలుగు మూవీని ఫ్లాప్ చేసి… ఆ డబ్బింగ్ మూవీని మాత్రం సూపర్ హిట్ చేశారా..?
End of Article