అదే కాన్సెప్ట్ తో వచ్చిన మన తెలుగు మూవీని ఫ్లాప్ చేసి… ఆ డబ్బింగ్ మూవీని మాత్రం సూపర్ హిట్ చేశారా..?

అదే కాన్సెప్ట్ తో వచ్చిన మన తెలుగు మూవీని ఫ్లాప్ చేసి… ఆ డబ్బింగ్ మూవీని మాత్రం సూపర్ హిట్ చేశారా..?

by kavitha

Ads

కాంతార తరువాత కన్నడలో తెరకెక్కిన చిన్న సినిమాల పై కూడా తెలుగు ఆడియెన్స్ దృష్టి పడుతోంది. సినిమా ఏ మాత్రం కొత్తగా ఉన్నా, కాన్సెప్ట్ ఉన్నా వాటికి బ్రహ్మరధం పడుతున్నారు. ఆ క్రమంలోనే మరో కన్నడ చిన్న బడ్జెట్ మూవీ రిలీజ్ అయింది.

Video Advertisement

ఆ మూవీ “సప్త సాగరాలు దాటి ” అనే టైటిల్ తో తెలుగులో విడుదల అయ్యింది. ఈ కన్నడ సినిమాకి విపరీతంగా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. తెలుగు ఆడియెన్స్ ను కూడా ఈ మూవీ ఆకట్టుకుంది. అయితే గతంలో ఇలాంటి స్టోరీ లైన్ తో వచ్చిన ప్రముఖ హీరో సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ మూవీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
sapta sagaralu dhaati side a movie reviewకన్నడ స్టార్ రక్షిత్ శెట్టి ‘ఛార్లీ’ సినిమాతో తెలుగు ఆడియెన్స్ చేరువయ్యాడు. అంతకుముందు అతడే శ్రీమన్నారాయణ మూవీతో పరిచయం అయ్యాడు. ఈ సినిమాలు మంచి కలెక్షన్స్ సాధించాయి. ఇక కన్నడ ఇండస్ట్రీలో భారీగా కలెక్షన్స్ సాధించి, లాభాలను అందించాయి. సప్త సాగరదాచే ఎల్లో మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
రక్షిత్ శెట్టి నటించిన ఈ సినిమాను ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్ తో సెప్టెంబర్ 22న తెలుగులో రిలీజ్ చేశారు. ఈ మూవీ తెలుగులో మొదటి రోజు మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీకి రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి. అయితే దాదాపు ఇదే స్టోరీ లైన్ తో రిలీజ్ అయిన మాస్ మహారాజ రవితేజ మూవీ మాత్రం ఫ్లాప్ అయ్యింది. హరీష్ శంకర్ తొలి సారి దర్శకత్వం వహించిన షాక్ మూవీలో రవితేజ, జ్యోతిక జంటగా నటించారు.ఈ సినిమాని రామ్ గోపాల్ వర్మ నిర్మించారు. ఈ మూవీ 2006 లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో కూడా హీరో జైలుకి వెళ్తాడు. నెట్టింట్లో అదే కాన్సెప్ట్ తో వచ్చిన తెలుగు సినిమాని ఫ్లాప్ చేసి, డబ్బింగ్ సినిమాని మాత్రం సూపర్ హిట్ చేసారు అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: ఒక సీనియర్ హీరో సినిమా అంటే ఇలా ఉండాలి ఏమో..? ఈ సినిమా చూశారా..?


End of Article

You may also like