ఒక సీనియర్ హీరో సినిమా అంటే ఇలా ఉండాలి ఏమో..? ఈ సినిమా చూశారా..?

ఒక సీనియర్ హీరో సినిమా అంటే ఇలా ఉండాలి ఏమో..? ఈ సినిమా చూశారా..?

by kavitha

Ads

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గురించి, ఆయన నటన గురించి తెలుగు ఆడియెన్స్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వాతి కిరణం మూవీ ద్వారా, డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారికి చేరువయ్యారు. మమ్ముట్టి ఏ పాత్ర చేసినా, సహజంగా ఆ పాత్రలో ఒదిగిపోతుంటారు.

Video Advertisement

ఏ హీరో చేయని డిఫరెంట్ కథలను ఎంచుకొని మమ్ముట్టి తన అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంటారు. కొత్త కొత్త స్టోరీలతో మెప్పించడమే కాకుండా, ఎన్నో సూపర్ హిట్ లను కూడా సొంతం చేసుకున్నారాయన. తాజాగా కన్నూర్ స్క్వాడ్ మూవీతో మమ్ముట్టి ఆడియెన్స్ ని పలకరించారు. మరి ఆ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
మమ్ముట్టి నటించిన కన్నూర్ స్క్వాడ్ మూవీ సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీని సొంత ప్రొడక్షన్ హౌజ్ లో మమ్ముట్టి నిర్మించారు. ఈ యాక్షన్-మిస్టరీ థ్రిల్లర్ మూవీకి రాబి వర్గీస్ రాజ్ దర్శకత్వం వహించారు. రిలీజ్ అయిన మొదటి షో నుండే ఈ మూవీ ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆడియెన్స్ డిమాండ్ మేరకు 25 కొత్త కేంద్రాలలో 70 అదనపు షోలను ప్రారంభించారు.
ఇక కథ విషయాని వస్తే, ఇక ఒక రాజకీయ నాయకుడి ఇంట్లోవారిని హత్య చేసి, ఇంట్లోని నగలు డబ్బును కొందరు  దోచుకుని వెళ్తారు. ఈ కేసును చేధించడానికి కన్నూర్ స్క్వాడ్ ను నియమిస్తారు. ఈ స్క్వాడ్ ఏఎస్ఐ జార్జ్(మమ్ముట్టి ) నేతృత్వంలోని నలుగురు సభ్యుల ప్రత్యేక పోలీసుల దర్యాప్తు బృందం. ఏఎస్ఐ జార్జ్, అతని టీమ్ ఈ కేసును ఎలా చేధించారు అనేది మిగిలిన కథ.
సినిమాటోగ్రాఫర్ రాబీ వర్గీస్ రాజ్ ఈ మూవీతో దర్శకుడిగా మారారు. సినిమా కథనం ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు, సినిమా వేగం పుంజుకుంటుంది. ఈ చిత్రం సెకండాఫ్ శరవేగంగా సాగుతూ, ఆశ్చర్యం కలిగిస్తుంది. మమ్ముట్టి ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకున్నారు. మమ్ముట్టి చెప్పే ‘మాస్’ డైలాగ్‌లు ఆడియెన్స్ ను అలరిస్తాయి.

Also Read: “అమృతం” సీరియల్ లో అప్పుడు చెప్పినట్టే ఇప్పుడు జరిగింది కదా..? విషయం ఏంటంటే..?

 

 


End of Article

You may also like