Home Filmy Adda కిరణ్ అబ్బవరం “వినరో భాగ్యము విష్ణు కథ” ఫస్ట్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

కిరణ్ అబ్బవరం “వినరో భాగ్యము విష్ణు కథ” ఫస్ట్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

by Anudeep

హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, క‌శ్మీర ప‌ర్ధేశీ జంట‌గా నటిస్తున్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణుకథ’. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై బ‌న్నీ వాసు నిర్మాత‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ముర‌ళి కిషోర్ ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అవుతున్నాడు. ప్ర‌శాంత్ నీల్, కిషోర్ తిరుమ‌ల ద‌గ్గ‌ర మురళి కిషోర్ గ‌తంలో పని చేశాడు. రాజావారు.. రాణి వారు, ఎస్ఆర్ కల్యాణ మండపం, సమ్మతమే లాంటి సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్నాడు కిరణ్ అబ్బవరం.

అయితే ఈయన తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణుకథ లో కూడా ఎప్పటిలానే పక్కింటి అబ్బాయిలా కిరణ్ అబ్బవరం కనిపించనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 18 న విడుదల కానుంది. విలేజ్‌ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రానికి చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం సమకూర్చారు. నెంబర్ నైబర్ కాన్సెప్ట్ మీద తీసిన ఈ చిత్రం ఆసక్తికరంగా ఉండనున్నట్లు ట్రైలర్ లో స్పష్టమవుతోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రివ్యూ ఒకటి వైరల్ గా మారింది.

vinaro bhagyamu vishnu katha movie first review..

‘వినరో భాగ్యము విష్ణు కథ’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. మంచి సినిమా తీశారని సెన్సార్ సభ్యులు చిత్ర నిర్మాతలను ప్రశంసించారని దేవి ప్రియా అనే ట్విట్టర్ ఖాతా నుంచి ఈ రివ్యూ ఇచ్చారు. అలాగే ఈ చిత్ర రన్ టైం కూడా లాక్ అయ్యిందని తెలుస్తోంది. ఈ చిత్రం 2 గంటల 18 నిమిషాల నిడివి ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ట్రైలర్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

vinaro bhagyamu vishnu katha movie first review..

అలాగే మరో వైపు జీఏ 2 పిక్చర్స్ సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడం… ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో ‘వినరో భాగ్యము విష్ణుకథ’ విడుదలకు కొన్ని రోజుల ముందే లాభాల్లోకి వెళ్ళిందని తెలుస్తోంది. డిజిటల్ & శాటిలైట్ స్ట్రీమింగ్ రైట్స్ కూడా ఇప్పటికే అమ్మేసారు. వాటితో బడ్జెట్ మొత్తం రికవరీ కావడమే కాదు, లాభాలు వచ్చాయని సమాచారం.

You may also like