అంబానీకి కాబోయే కోడలు రాధికా మర్చంట్ గురించిన విశేషాలు తెలుసా..? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటంటే..?

అంబానీకి కాబోయే కోడలు రాధికా మర్చంట్ గురించిన విశేషాలు తెలుసా..? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటంటే..?

by kavitha

Ads

భారత దిగ్గజ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి జులై 12న జరుగబోతుంది. ప్రస్తుతం అందరి దృష్టి అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలపై పడింది.

Video Advertisement

అనంత్ అంబానీ,  రాధికా మర్చంట్ లకు గత ఏడాది ఎంగేజ్మెంట్ జరిగింది. మార్చి 1నుండి 3 మధ్యన ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే సందడి కూడా ప్రారంభం అయ్యింది. అంబానీ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టబోతున్న రాధికా మర్చంట్ గురించిన విషయాలను ఇప్పుడు చూద్దాం..

ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్ధం 2023 లో జనవరి 19న రాధిక మర్చంట్ రాజస్తాన్ లో శ్రీనాథ్ జీ దేవాలయంలో కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల మధ్యలో జరిగింది. అనంత్, రాధికాలకు చాలాకాలం నుండే  పరిచయం ఉంది. ఇన్నిరోజులు మంచి ఫ్రెండ్స్ గా ఉన్న వీరిద్దరు, త్వరలో వివాహబంధంతో ఒక్కటి కానున్నారు. రాధిక మర్చంట్ తండ్రి పేరు వీరేన్ మర్చంట్, ఆయన కూడా పారిశ్రామిక వేత్తనే.

రాధిక 1994లో డిసెంబర్ 18న శైల మర్చంట్, వీరేన్ మర్చంట్ లకు జన్మించారు. వీరెన్ మర్చంట్ ప్రముఖ ఫార్మా కంపెనీ ఎన్ కోర్ హెల్త్ కేర్ అధినేత. అంతేకాకుండా ఇండియాలోని అత్యంత ధనవంతుల్లో ఆయన కూడా ఒకరు. రాధిక ముంబైలో, ఆ తరువాత న్యూయార్క్ లో విద్యాభ్యాసం చేశారు. న్యూయార్క్ యూనివర్సిటీలో పొలటికల్ సైన్స్, ఎకనమిక్స్ లో డిగ్రీ పొందారు. చదువు పూర్తయిన తరువాత ముంబైలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘ఇస్ప్రవ’ లో కొన్ని రోజులు జాబ్ చేశారు. ప్రస్తుతం రాధికా మర్చంట్ తమ సొంత సంస్థ ఎన్‌కోర్ హెల్త్‌కేర్ లో డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

రాధిక మర్చంట్ కూడా కాబోయే అత్తగాఋ అయిన నీతా అంబానీ వలె భరత నాట్య కళాకారిణి. ఆమె ముంబైలో గురు భావన ఠాకూర్ దగ్గర శ్రీ నిభా ఆర్ట్స్ డాన్స్ అకాడమీలో సుమారు  ఎనిమిది సంవత్సరాలు శిక్షణ తీసుకున్నారు. రాధిక భరత నాట్య అరంగేట్రంను అంబానీ ఫ్యామిలీ 2022 లో ‘జియో వరల్డ్ సెంటర్‌’ లో నిర్వహించిన కార్యక్రమంలో చేశారు. ఈ ఈవెంట్‌‌ కి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. రాధిక మర్చంట్ ప్రదర్శన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

Also Read: RK BEACH FLOATING BRIDGE: పెట్టిన మరుసటి రోజునే ఊడిపోయింది అని ట్రోల్ చేసారు.. కానీ ఇది అసలు కథ..!


End of Article

You may also like