Ads
బీటెక్ చదివిన ప్రతివాడు క్యాంపస్ డ్రైవ్ లో జాబ్ కొట్టామా.. మంచి జీతంతో వీకెండ్స్ ఎంజాయ్ చేస్తున్నామా.. అనే ఆలోచిస్తారు. కానీ ఆ సాఫ్ట్వేర్ జాబ్స్ అందరికి వస్తాయా అంటే అది అనుమానమే.. అందుకే ప్రస్తుతం మన దేశం లో ఎందరో గ్రాడ్యుయేట్స్ ఉపాధి లేక విలవిల్లాడుతున్నారు. కానీ ఒకరు మనకి పని ఇచ్చేవరకు ఎందుకు మనమే ఉపాధి కల్పించుకుందాం అని ముందడుగు వేస్తున్నారు కొందరు గ్రాడ్యుయేట్స్.
Video Advertisement
మనం ఇప్పటికే యంబీఏ చాయ్ వాలా, గ్రాడ్యుయేట్స్ చాయ్ వాలా వంటి వాటి గురించి విన్నాం.. కానీ ఇప్పుడు బీటెక్ చేసి పని పూరి అమ్ముకునే ఈ అమ్మాయి గురించి తెలుసుకుందాం.. దేశ రాజధాని ఢిల్లీ లో ‘బీటెక్ పానీ పూరీ వలీగా’ ప్రసిద్ధి చెందారు 21 ఏళ్ల తాప్సీ ఉపాధ్యాయ్. ఢిల్లీలోని తిలక్ నగర్‌లో యువ పారిశ్రామికవేత్త గోల్గప్పా స్టాల్ ఉంది. ఇటీవల సోషల్ మీడియా లో వైరల్ గా మారింది ఈ యువ వ్యాపారవేత్త. 21 ఏండ్ల తాప్సి ఉపాధ్యాయ్ బీటెక్ పానీపూరి వాలిగా పేరొందిన తీరును ఆర్ యూ హంగ్రీ అనే ఇన్‌స్టాగ్రాం పేజ్ లో పోస్ట్ చేసారు. ఈ క్లిప్ ఆన్‌లైన్‌లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 50 లక్షల వ్యూస్ రాబట్టింది.
చదువు పూర్తయ్యాక పానీ పూరీలు ఎందుకు అమ్ముతున్నావని చాలా మంది తనను అడిగేవారని, ఓ మహిళ వీధిలో ఉండడం సురక్షితం కాదని కొందరు తనను ఇంటికి వెళ్లమని కూడా సలహా ఇచ్చారని కూడా తాప్సి ఉపాధ్యాయ్ ఆ వీడియో లో చెప్పింది. తాప్సి . బిటెక్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత తన వ్యాపారాన్ని ప్రారంభించింది. ప్రజలకు ఆరోగ్యకరమైన స్ట్రీట్ ఫుడ్ ని అందించడమే ఆమె లక్ష్యం.
ఈ స్టాల్ లో ఆమె మైదా లేకుండా పానీపూరి లు, ప్లాస్టిక్ కప్స్ కి బదులు ఆకులతో చేసిన కప్స్.. అలాగే పూరి లో పొసే చట్నీల కోసం ఖర్జురాలు వాడుతోంది. పానీ కోసం ప్రత్యేకంగా చేతితో దంచిన మసాలాలు వేసి చేస్తోందట తాప్సి.ఆమె తన స్టాల్‌కి మరిన్ని స్ట్రీట్ ఫుడ్ ఆప్షన్‌లను జోడించి వాటిని ఆరోగ్యవంతంగా మార్చాలని కోరుకుంటుంది. తన స్టాల్ లో ఫుడ్ ఆరోగ్యంగా ఉండటం తో పాటు.. రుచిగా ఉండటం తో ఈ బిజెనెస్ లక్భల్లో సాగుతోందని వెల్లడించింది తాప్సి. బీటెక్ పానీ పూరీ వలీ పేరుతో ఈమె ఒక ఇంస్ట్గ్రామ్ పేజీ ని కూడా స్టార్ట్ చేసి.. అందులో కస్టమర్స్ రివ్యూస్ కూడా ఇస్తోంది తాప్సి.
End of Article