Ads
సినీ ఇండస్ట్రీ లో విలన్ గా కెరీర్ ను ప్రారంభించి హీరోగా మారిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్‌లో ఈ యాక్టర్ పేరు కూడా ఉంటుంది. అతడే నటుడు అర్జున్ దాస్. తమిళ చిత్రాలు మాస్టర్, ఖైదీ, విక్రమ్ సినిమాలతో బాగా పాపులర్ అయ్యాడు నటుడు అర్జున్ దాస్. గతంలో చేసిన సినిమాలకంటే ఈ మూడు సినిమాలు అతనికి మంచి పేరుని తెచ్చిపెట్టాయి. ఇక అతని వాయిస్ గంభీరంగా ఉండటంతో అతని వాయిస్ తో కూడా బాగా పాపులర్ అయ్యాడు. తక్కువ టైంలో అతనికి తమిళ్ తో పాటు తెలుగులో కూడా అభిమానులు వచ్చారు.
Video Advertisement
అతడు తెలుగులో నేరుగా చేసిన చిత్రం ఒకటే ఒకటి అది గోపీచంద్ హీరోగా వచ్చిన ఆక్సిజన్ మూవీ. ఆ తర్వాత అన్ని తమిళ చిత్రాలే చేస్తూ వచ్చాడు అర్జున్ దాస్. గతేడాది 7 సినిమాల్లో నటించాడు.అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే అతడు పాపులర్ అవుతుండడం విశేషం. అతడు తొలిసారిగా నటించిన మూవీ కార్తి హీరోగా వచ్చిన ఖైదీ. ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ రోజుల్లోనే అర్జున్ తనని తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు తాజాగా ‘బుట్టబొమ్మ’ చిత్రం తో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
చెన్నైలో జన్మించిన అర్జున్ చిన్న తనం నుంచి చదువులో ముందుండేవాడు.అలాగే నటన అంటే కూడా మహా ఇష్టం.కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తాను ముందు లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకున్నాడు అర్జున్. తర్వాత దుబాయిలో బ్యాంకు ఉద్యోగం సాధించి లక్షల్లో జీతం అందుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఆ జాబ్ మానేసి నటుడిగా తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఉద్యోగం మానేసి మళ్లీ చెన్నైకి వచ్చి చేరుకున్నాడు.
అయితే చెన్నైకి వచ్చాక అతను బాగా బరువు పెరిగాడు.అయితే సినిమాల్లో నటించాలంటే ఇంత బరువు ఉండకూడదు అనుకొని ఏకంగా 32 కేజీలు తగ్గాడు. అర్జున్ మొదటిసారిగా పెరుమాన్ అనే సినిమాలో నటించాడు.ఈ సినిమాలో మెయిన్ రోల్ లో నటించిన కూడా అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత చాలా కాలం తర్వాత కార్తీతో ఖైదీ సినిమాలో విలన్ గా నటించే అవకాశం దక్కింది. ఆ తరువాత అతడికి అవకాశాలు క్యూ కట్టాయి. ఒకే జోనర్ కి పరిమితం కాకుండా రకరకాల పాత్రలు ఎంచుకుంటున్నాడు అర్జున్ దాస్.
End of Article