వాల్తేరు వీరయ్య, ఏజెంట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఊర్వశీ రౌతేలా కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో సత్తా చాటుతోంది. అయిదోసారి రెడ్‌కార్పెట్‌లో పాల్గొన్న ఈ భామ అందర్నీ ఆకట్టుకుంటోంది. కేన్స్ 2023 లో ఊర్వశీ రౌతేలా ధరించిన నగలు, దుస్తులు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Video Advertisement

 

 

కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో రెడ్ కార్పెట్‌పై సినీ తారలు విచిత్ర వేషాధారణతో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంటే.. ఊర్వశి రటేలా విలువైన నగలు, ఖరీదైన దుస్తుల గురించి మీడియా ప్రత్యేకంగా ప్రస్తావిస్తోంది. ఊర్వశీ ధరించిన కార్టియర్ క్రోకడైల్ జ్యువెల్లరీ అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా మీడియాలోను, సోషల్ మీడియాలోను హాట్ టాపిక్‌గా మారింది. ఈ జ్యువెల్లరీని సైమా కోట్యూర్ డిజైన్ చేయడం గమనార్హం.

 

అయితే ఆమె ధరించిచన మొసలి నెక్లెస్ నకిలీదని కామెంట్స్ వచ్చాయి. తాజాగా ఈ ట్రోల్స్ పై ఊర్వశీ పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఆమె ధరించిన నెక్లెస్ విలువ రూ. 276 కోట్లు అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమె ధరించిన ఆభరణాలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరగగా.. మరి ముఖ్యంగా ఫేక్ నెక్లెస్ అంటూ ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఆమె టీమ్ స్పందిస్తూ.. ఆ నెక్లెస్ ధర రూ. 276 కోట్లు అని పేర్కొంది.

 

know the price of urvashi rautela's cartier crocodile necklace..

ఈ నెక్లెస్ గురించి ఊర్వశి కూడా ప్రత్యేకం గా ప్రస్తావించింది. అయితే నెక్లెస్ అన్ని కోట్లా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. మరో వైపు కొందరు ఫాషన్ నిపుణులు ఈ నెక్లెస్ ఫేక్ అని ఆధారాలు చూపిస్తున్నారు. 1975 లో కార్టియర్ సంస్థ ఈ నెక్లెస్ ని రెండువేలకు పైగా పైగా యెల్లో డైమండ్స్, ఎమరాల్డ్స్ తో కలిపి చేసారు. మెక్సికన్ నటి మరియా ఫ్లిక్స్ తన పెంపుడు మొసలికి గుర్తుగా వీటిని తయారు చేయించుకున్నారు.

know the price of urvashi rautela's cartier crocodile necklace..

ఆమె మరణించిన తర్వాత తన నగలను అమ్మేయగా.. హాలీవుడ్ నటి మోనికా బెలూచి 2006 కేన్స్ ఫెస్టివల్లో ధరించారు. వీరు ధరించిన ఒరిజినల్ నగ, ఇప్పుడు ఊర్వశి వేసుకున్న నగలకు చాలా వ్యత్యాసం ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అలాగే ఆ నెక్లెస్ కి మాచింగ్ చెవి రింగులు లేవని.. కానీ ఊర్వశి ఒరిజినల్ నగలను కాపీ చేయించి వేసుకుంది విమర్శలు వస్తున్నాయి.

know the price of urvashi rautela's cartier crocodile necklace..

ఇక ఊర్వశి రౌతేలా ప్రస్తుతం రామ్ పోతినేని బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలోనూ ఒక స్పెషల్ సాంగ్ చేస్తుంది. మరి ఆ సాంగ్ తో ఇంకెంత మంది హృదయాలను ఈ భామ దోచుకుంటుందో చూడాలి.