ప్రేమించిన పాపానికి నమ్మివచ్చిన మహిళను చంపేసి ఇంట్లోనే పాతి పెట్టాడు.

ప్రేమించిన పాపానికి నమ్మివచ్చిన మహిళను చంపేసి ఇంట్లోనే పాతి పెట్టాడు.

by Anudeep

Ads

గొర్రె కసాయి వాన్నే నమ్ముతుందని..ప్రేమించి మోసపోయే ఎన్ని ఘటనలు ఎన్ని వెలుగులోకి వస్తున్నా ముక్కు మొఖం తెలియని వ్యక్తిని నమ్మి, వారి కోసం ఎంత దూరం అయినా వెళ్లడానికి అమ్మాయిలు తెగించడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది..కేరళకు చెందిన ఒక మహిళ మామయ్యకు బాలేదని ఆఫీసులో సెలవు పెట్టి..ఆఫీస్ నుండి ట్రెయినింగ్ కి పంపిస్తున్నారు అని ఇంట్లో వాళ్లకి చెప్పి .. చివరికి శవమై తేలింది…చివరికి పోలీసుల దృష్టికి వెళ్లిన కేసులో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

Video Advertisement

కేరళలోని కొల్లామ్ జిల్లాకు చెందిన 42ఏళ్ల సుచిత్ర అనే మహిళ ట్రైనీ బ్యూటిషియన్ గా పనిచేస్తుంది..మామయ్యకు ఆరోగ్యం బాగలేదని, తనని చూసుకోవడానికి ఊరు వెళ్లాలని చెప్పి  మార్చి  17న ఆ ఆఫీస్లో సెలవు అడిగింది.వెంటనే మరో ఐదు రోజులు సెలవు పొడిగించాలని కోరింది..ఆఫీసులో ట్రెయినింగ్కి పంపిస్తున్నారని చెప్పి ఇంటి నుండి బయటికి వెళ్లింది.. ఐదు రోజులైనా సుచిత్ర నండి కాల్ రాకపోవడంతో సుచిత్ర కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.ఆఫీస్ కి ఫోన్ చేస్తే మామయ్యకి బాగలేదని  సెలవు తీసుకుందనే విషయం చెప్పారు. దాంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు..

భర్తతో విడాకులు తీసుకుని పుట్టింట్లోనే ఉంటున్న సుచిత్రకి మనాలికి చెందిన 32ఏళ్ల ప్రశాంత్ తో సోషల్ మీడియా వేదికగా పరిచయం ఏర్పడింది. తనొక కీ బోర్డ్ ప్లేయర్..సుచిత్ర, ప్రశాంత్ మధ్య ప్రేమాయణం నడిచిందని,ప్రశాంత్ ని కలవడానికే సుచిత్ర మనాలి వెళ్లిందని పోలీసుల దర్యాప్తులో తేలింది..మనాలి వెళ్లిన పోలీసులకి అక్కడ సుచిత్ర ఆచూకి దొరకలేదు..ప్రశాంత్ ని పట్టుకున్న పోలీసులు సుచిత్ర గురించి అడిగితే తనకు తెలీదన్నప్రశాంత్ తర్వాత అసలు విషయం చెప్పాడు.

representative image

సుచిత్ర, నేను సోషల్ మీడియాలో పరిచయం అయ్యాము..ఆ పరిచయాన్ని ఆమె సీరియస్ గా తీసుకుంది.. ప్రేమించానని , పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది.పెళ్లి విషయమై గొడపడిందని మొదట చెప్పిన ప్రశాంత్, పోలీసులు నాలుగు తన్నే సరికి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుందని ,తానే హత్య చేసి ఇంట్లో పాతి పెట్టానని నిజం ఒప్పుకున్నాడు.. ప్రశాంత్ చెప్పిన చోట తవ్వితే కుల్లిపోయిన శవం బయటపడింది. ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించగా ఆ మృతదేహం సుచిత్రదేనని తేలింది . దీంతో ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

representative image

ఎక్కడ కేరళ, ఎక్కడ మనాలి.. కేరళ టు మనాలి వరకు ముక్కు మొఖం తెలియని వాన్ని నమ్మి వెళ్లింది..చివరికి శవమై తేలింది..సోషల్ మీడియా పరిచయాల వలన మంచి కన్నా చెడే ఎక్కువగా జరుగుతోంది.ఇప్పటికైనా మహిళలు అప్రమత్తంగా ఉండాలి.


End of Article

You may also like