Ads
భారత్ లో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 28కి చేరింది. అయితే గడిచిన మూడు రోజుల్లోనే 25కేసులు నమోదవడం గమనార్హం . వైరస్ సోకినవారిలో 16మంది ఇటలీ టూరిస్టులే. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వాళ్ల సంఖ్య 90వేల 893కు చేరింది , ఇందులో చైనాలోనే 80 వేల మందికి పైగా హాస్పటల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3వేల 110 మంది. 20కిపైగా దేశాల్లో ఇప్పుడు కరోనా వైరస్ సోకినట్లు సమాచారం. కేరళలో వైరస్ సోకిన 20ఏళ్ల మెడికల్ స్టూడెంట్ సహా ముగ్గురూ కోలుకున్నారు.
Video Advertisement
భారత్ లో మొదటి కరోనా కేసు చైనా నుండి వచ్చిన మెడికల్ విద్యార్దినిదే అనే విషయం తెలిసిందే . ఇప్పడు తను పూర్తిగా కోలుకుంది. ఐసోలేషన్ వార్డులో ఉన్నప్పుడు తన అనుభవాలు,అసలు తనకు ఎప్పుడు కరోనా పాజిటివ్ అని తేలింది,తాను ఏ విధంగా వైరస్ తో ఫైట్ చేసింది అన్న విషయాలను మీడియాతో ఆ యువతి పంచుకున్నారు. తన మాటల్లోనే చదవండి.
“జనవరి-13,2020న నాలుగు వారాల వెకేషన్ కోసం వూహాన్ యూనివర్శిటీ మూసివేయబడింది. ఆ సమయంలో ఈ కరోనా వైరస్ ను గుర్తించలేదు. చాలా మంది రోడ్లపై తిరుగుతున్నారు. అంతా మామూలుగానే అనిపించింది. జనవరి-17,2020 నాటికి వీధుల్లో ప్రజలు మాస్క్ లతో తిరుగుతున్నారు. నాలుగురోజుల్లోనే పరిస్థితి దారుణంగా మారిపోయింది. మా సెలవులు కేవలం నాలుగు వారాలు మాత్రమే ఉన్నాయి. జూన్ లో మాకు లాంగర్ హాలిడేస్ ఉంటాయి. ఫ్లైట్ టిక్కెట్లు వంటివన్నీ దృష్టిలో పెట్టుకుని జూన్ లోనే ఇంటికి వెళ్ళాలనుకున్నాను. అయితే వూహాన్ లో పరిస్థితి మరింత దారుణంగా మారడంతో జనవరి-23న ప్రయాణం చేసేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్నాం. విమాన సేవలు అప్పటికే పరిమితం చేయబడినందున మేము కన్నింగ్ నుండి కోల్‌కతాకు బయలుదేరాల్సి వచ్చింది.
విమానాశ్రయాలు మూసివేయబడతాయని జనవరి 22 న మా సీనియర్లు చెప్పారు. కన్నింగ్‌కు కనెక్ట్ చేసే ఫ్లైట్ కోసం మేము వెంటనే ఎయిర్పోర్ట్ కి వెళ్లినప్పటికి, విమానం ఆలస్యం అని తెలియడంతో మేము ట్రైన్లో కన్నింగ్ కు వెళ్లాం. అయితే చైనాలో ప్రతి చోటా చెకింగ్ ను ఎదుర్కొన్నాం. యూనివర్శిటీ నుంచి బయటికి వెళ్లేటప్పుడు మా బాడీ టెంపరేచర్ చూశారు. అదే విధంగా ఎయిర్ పోర్ట్ లలో,రైల్వే స్టేషన్లలో బాడీ టెంపరేచర్ చూశారు. తర్వాతే మమల్ని వెళ్లనిచ్చారు. నాతో పాటు 20మంది విద్యార్థులం కలిసి జనవరి-23న కేరళ చేరుకున్నాం. అక్కడి నుంచి కొంతమంది కేరళకు వెళ్లాం. భారత్ కు వచ్చిన తర్వాత దగ్గర్లోని హెల్త్ అధికారులతో టచ్ లో ఉండమని ఇండియన్ ఎంబసీ నుంచి గ్రూప్ లో నాకు ఓ మెసేజ్ వచ్చింది.
జనవరి-25న నేను వచ్చినట్లు మాకు దగ్గర్లోని హెల్త్ సెంటర్ కు సమాచారమందించాను . నన్ను తనిఖీ చేస్తున్న అధికారుల నుండి నాకు రోజూ కాల్స్ వచ్చేవి. అంతా నార్మల్ గానే ఉంది అనుకున్నాను .కానీ జనవరి 27 నాటికి, నా గొంతులో దురద ఏర్పడింది. నేను వెంటనే వారికి సమాచారం ఇచ్చాను. వారు అంబులెన్స్ పంపించి నన్ను జనరల్ హాస్పటల్ కి తీసుకువెళ్లారు.అప్పుడు మా మదర్ నాతో పాటుఉన్నారు. హాస్పిటల్ కు తీసుకెళ్లిన తర్వాత నన్ను ఐసొలేషన్ వార్డులో ఉం చారు. నాతో పాటు కేరళకు వచ్చిన మిగిలిన నలుగురి శాంపిల్స్ కూడా టెస్ట్ లకు పంపించారు. నావి తప్ప మిగిలిన వాళ్లకు కరోనా సోకలేదని తేలింది. అయితే ఆ విషయం అప్పుడు నాకు ఎవరూ చెప్పలేదు.
జనవరి-30న వచ్చిన రిపోర్ట్ లలో నాకు వైరస్ ఉన్నట్లు తేలింది. వెంటనే డాక్టర్లు,నర్సుల బృందం నా దగ్గరికి వచ్చారు. చాలా సేపు నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగారు. అన్ని వైద్య సంరక్షణల తరువాత, తరువాతి పరీక్షలలో ఒకదానిలో నెగిటివ్ వచ్చినప్పుడు నాకు ఎలాంటి సమాచారం చెప్పలేదు . వరుసగా రెండవ పరీక్ష ఫలితం తర్వాత నేను కోరోనా వైరస్ నుంచి కోలుకున్నాను. టెస్ట్ లలో నెగిటివ్ వచ్చిందని మాత్రమే నాకు చెప్పారు . ఫిబ్రవరి-20న తనను డిశ్చార్జ్ చేశారు, అయినప్పటికి 14రోజుల పాటు ఇంటినుంచి బయటకు రాకూడదని డాక్టర్లు స్ట్రిక్ట్ గా చెప్పారు .
అధికారులు మాకు ప్రయాణం చేయవచ్చని చెప్తేనే వూహాన్ తిరిగి వెళ్తాం, మా క్లాస్ లో మొత్తం 65మంది విద్యార్థులు అందులో 45మంది ఇండియన్స్మే ,ప్రస్తుతం మేమందరం ఆన్ లైన్ ద్వారా క్లాస్ లకు అటెండ్ అవుతున్నాం. సుమారు 39రోజుల పాటు ఐసోలేషన్(ఒంటరిగా) లో ఉండడం మామూలు విషయంకాదు. కానీ కౌన్సిలర్స్ తనను క్రమం తప్పకుండా పిలిచి,తన మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. తనకు కరోనా పాజిటివ్ అని తేలినప్పుడు , నాతో సహా ప్రయాణించిన స్నేహితులందరికీ ఫోన్ చేశాను, వారిని కూడా హెల్త్ టెస్టులు చేయించుకోమని, డాక్టర్స్ తో టచ్ లో ఉండమని చెప్పాను.
వైరస్ తో హాస్పిటల్ కు వెళ్లినప్పుడు డాక్టర్లు, అధికారులు తన దగ్గరకు వచ్చి అన్ని వివరాలు అడిగారు. ఎక్కిన ఫ్లైట్,సీటు నెంబర్, సహా ప్రయాణించిన వారందరి వివరాలు అడిగారు . వైరస్ తో పోరాడటానికి మానసికంగా నన్ను నేను సిధ్దం చేసుకున్నాను. చైనాలో వైరస్ నుండి కోలుకున్న వ్యక్తుల గురించి విన్నాను. నేను శారీరకంగా బాగానే ఉన్నానని నాకు తెలుసు. కేరళ ఆరోగ్యమంతి కెకె శైలజా నా తల్లిని పిలిచి మాట్లాడారు , నా ఆరోగ్యం పట్ల భరోసా ఇచ్చారు” అంటూ ఒక ఇంగ్లీష్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలు పంచుకుంది.
End of Article