వుహాన్ లో కథ మళ్లీ మొదటికొచ్చిందా? కోలుకున్న వారిలో మళ్లీ కరోనా పాజిటీవ్? ఇతరులకు సోకుతుందా?

వుహాన్ లో కథ మళ్లీ మొదటికొచ్చిందా? కోలుకున్న వారిలో మళ్లీ కరోనా పాజిటీవ్? ఇతరులకు సోకుతుందా?

by Anudeep

Ads

ఒకటి రెండు కాదు ఏకంగా అరవై రోజులపాటు హోం క్వారంటైన్లో ఉన్న ఊహాన్ నగరం ఇప్పుడిప్పుడే వెలిగిపోతుంది, రెండు నెలలు ఎక్కడికక్కడ క్లోజ్ అయిపోయి చీకటిలో గడిపిన నగరం ఇప్పుడు ఒక్క కరోనా కేసు లేకుండా ఊపిరి పీల్చుకుంటుంది అని మొన్ననే చదివాం . కాని  ఆ సంతోషం మూడు రోజులు కూడా నిలవలేదు. వుహాన్ సిటిలీ కరోనా మళ్లీ బయటపడుతుంది.. వైరస్ ప్రభావం నుండి కోలుకున్న వారిలో మళ్లీ పాజిటివ్ లక్షణాలు కనపడుతూ కలవరపెడుతున్నాయి.

Video Advertisement

రెండు నెలల తర్వాత లాక్ డౌన్ నుండి బయటికి వచ్చిన చైనా ప్రభుత్తవం పనులు ప్రారంభించింది . కరోనా పేషెంట్స్ కోసం నిర్మించిన వెయ్యి పడకల హాస్పిటల్ నుండి చివరి పేషెంట్ ని డిశ్చార్జి  చేసి హమ్మయ్య అని అనుకుంది. అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఒక్క కేసుకూడా నమోదు కాలేదు. సంతోషం.. కానీ  ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన చైనీయులంతా తిరిగి స్వదేశానికి చేరుకుంటున్న సమయంలో కొత్త కేసులు నమోదు కావడం, కోలుకున్న కరోనా బాధితుల్లో కొందరికి మళ్లీ పాజిటీవ్ లక్షణాలు ఉన్నట్టు నిర్ధారణ కావడంతో దిగ్బ్రాంతికి గురైంది.

సౌత్ చైనా మార్నింగ్ చేసిన ఒక పోస్టు ఏం చెప్తుందంటే కరోనావైరస్ నుండి కోలుకున్న వారిలో  10 శాతం మందిలో మళ్లీ కరోనా పాజిటివ్ లక్షణాలు కనపడ్డాయి.ఇప్పటి వరకు వైరస్ బారిన పడిన వారిలో 90 శాతం మంది రోగులు కోలుకొని, పది శాతం మంది అనగా 4,300 మంది మాత్రమే  చికిత్స పొందుతున్నారు. కోలుకున్న వారిలో 3 నుండి 10 శాతం మంది మళ్లీ వైరస్ బారిన పడ్డారు. కోలుకున్న రోగులపై హెల్త్‌కేర్ ప్రొవైడర్లు న్యూక్లియిక్ యాసిడ్ పరీక్షలు నిర్వహించగా ఈ విషయం బయట పడింది. కోలుకున్న రోగులపై వైరస్‌ను గుర్తించడంలో న్యూక్లియిక్ యాసిడ్ పరీక్షల పనితీరుని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటివరకు 80 నుండి 90 శాతం మందిలో కోలుకున్న ఒక నెల తర్వాత వారి రక్తంలో వైరస్ లేదని తేలింది. అయినప్పటికి కూడా వారిని ఒక నెల పాటు క్వారంటైన్ లో ఉంచి, మళ్లీ టెస్టులు నిర్వహించాలనుకుంటున్నారు. దీనికి కారణం పదిశాతం మందిలో మళ్లీ పాజిటివ్ లక్షణాలు కనపడడమే. అయితే, వైరస్ తిరగబెట్టిన వారి నుంచి ఇతరులకు కరోనా వైరస్ సోకుతుందా? లేదా అనేదానికి ఇంకా సమాధానం దొరకలేదు.

ఎందుకంటే కోలుకున్న వారిలో పాజిటివ్ నిర్దారణ జరిగింది కానీ, వ్యాధి లక్షణాలు కనపడలేదు. అంతేకాదు వారి కుటుంబ సభ్యులకు సోకిన లక్షణాలు కూడా కనపడలేదు. ఇదొక ఆశాజనకమైన విషయం.. అందుకే ఈ పది శాతం మందిలో ప్రైమరీ టెస్టుల ద్వారానే ఒక నిర్దారణకి రావడం కష్టం, మరికొన్ని టెస్టులు చేసాక నిర్దారించాల్సిన అవసరం ఉంది. మరో వైపు  ఈ వ్యాధి గురించి ఇంకా పూర్తి స్థాయిలో అధ్యయనం జరగాల్సి ఉందనేది ఆరోగ్య నిఫుణులు సూచిస్తున్నారు.


End of Article

You may also like