మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ‘కొణిదెల ఉపాసన’ ఆమె చేసే మంచి పనుల ద్వారా చాల మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.సోషియల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఉపాసన గారు..సమాజం లో జరుగుతున్న సంఘటనల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఆమె భావాలను వ్యక్త పరుస్తూనే ఉంటారు..తాజాగా ఉపాసన గారు చేసిన ట్వీట్.మరింత వైరల్ గా మారింది అంతే కాదు అది చాలా ఎమోషనల్ గా కూడా ఉంది ఇంతకీ పోస్ట్ ఏంటి అంటే.

Video Advertisement

‘గత 20 రోజులుగా మనము ఎన్నో భరిస్తూ వచ్చాము మా కుటుంబంలో ముగ్గురు పెద్దలు స్వర్గస్థులుఅయ్యారు,ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ 19 కేసులు పెరిగిపోతున్నాయి,బోర్డర్ లో భారతీయ సైనికులు మరణించారు,బాలీవుడ్ లో హీరో శుశాంత్ రాజపుత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవటం…వీటన్నింటిని మరిచిపోవటం అంత సులభం కాదు,వారం క్రిందట పెళ్లి రోజు ని కూడా సెలెబ్రేట్ చేసుకునే ఆసక్తి అసలు లేదు.మూడు రకాల ఆవకాయ పచ్చళ్ళు,అన్నం,చిప్స్,ఇంట్లోనే టీవీ చూస్తూ గడిపేసాం.

ఈ సందర్బంగా ట్వీట్ కి ఫోటో జోడిస్తూ ఫొటోలో గుర్రం బొమ్మలు,బుక్స్ అన్నం చిప్స్ ఉన్న ఫొటోస్ షేర్ చేసారు.ఉపాసన గారు చెప్పింది నిజమే కదూ 2020 చాల అనర్థాలు జరుగుతున్నాయి మరచిపోలేని సంఘటనలు కంటికి కనపడుతున్నాయి..ఈ ఇయర్ త్వరగా వెళ్ళిపోతే బాగుంటుందని అందరికి అనిపిస్తుంది.ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది.