kotabommali ps ott Platform: ఓటిటి లోకి రానున్న కోట బొమ్మాళీ పిఎస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే….!

kotabommali ps ott Platform: ఓటిటి లోకి రానున్న కోట బొమ్మాళీ పిఎస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే….!

by Mounika Singaluri

Ads

kotabommali ps ott Release Date: శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నవంబర్లో విడుదలైన చిత్రం కోట బొమ్మాళీ పిఎస్. ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. యాక్షన్ ఓరియంటెడ్ థ్రిల్లర్ మూవీ గా పాలిటిక్స్ ను బేస్ చేసుకుని ఈ మూవీ ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ టు బ్యానర్ పైన ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా త్వరలో ఓటిటి లో ప్రసారం కానుంది.

Video Advertisement

ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను తెలుగు ఓటిటి సంస్థ ఆహా కొనుగోలు చేసింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11 నుండి స్ట్రీమ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా నుండి వచ్చిన లింగి లింగి లింగిడి సాంగ్ ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.

kotabommali ps ott

kotabommali ps ott

రాజకీయాలకు పోలీసులకు లింక్ చేసి ఈ సినిమాని అధ్యంతం ఆకట్టుకునే విధంగా దర్శకుడు తేజ తర్కెక్కించారు. ఈ సినిమా మంచి రివ్యూలు తెచ్చుకోవడం తో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ నటన అందరినీ ఆకట్టుకుంది. ఆయన కెరీర్లో మరో మంచి పాత్రగా నిలిచిపోతుంది. రాహుల్ విజయ్, శివాని కూడా చాలా అద్భుతమైన నటన కనబరిచారు. థియేటర్లలో మంచి విజయం అందుకున్న ఈ సినిమా ఓటిటి లో కూడా ప్రేక్షకుల ఆదారాభిమానులను అందుకుంటుందని చెబుతున్నారు


End of Article

You may also like